ఇటీవల పోస్టాఫీసులో కూడా బ్యాంకు తరహాలో డబ్బు లావాదేవీలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోస్ట్ ఆఫీస్ ఏటీఎంలు కూడా అందుబాటులోకి రావడం జరిగాయి. చాలా మంది మధ్య మరియు పేద ప్రజలు తమ డబ్బును పోస్టాఫీసుల్లో వివిధ రూపాల్లో దాచుకుంటున్నారు. ఎటువంటి షరతులు మినిమమ్ బ్యాలెన్స్ వంటివి ఇప్పటివరకు పోస్ట్ ఆఫీస్ లో లేవు. అయితే తాజాగా పోస్టల్ అకౌంట్ ఉన్నవారికి ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదేమిటంటే బ్యాంకు తరహాలో పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ మెయింటెన్ చేసే వాళ్లు కూడా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి తాజాగా కొత్త రూల్ ప్రవేశపెట్టడం జరిగింది. బ్యాంకు తరహాలోనే పోస్ట్ ఆఫీస్ సూత్రాలు పాటించడంతో ఇప్పటినుండి పోస్టల్ ఎకౌంట్లో మినిమం 500 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యాలని కొత్త రూల్ పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టడం జరిగింది.

 

లేకపోతే జరిమానాలు కట్టాల్సి వస్తుందని….జరిమానా ఫైన్ కూడా భారీగానే విధించబోతున్నట్లు స్పష్టం చేశారు పోస్ట్ ఆఫీస్ నిర్వాహకులు. పోస్టల్ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉందని హోటల్ యాజమాన్యం తెలిపింది. అకౌంట్లో రూ.500లు ఖచ్చితంగా ఉండాలని, లేకపోతే ఖాతాదారుడికి రూ.100ల జరిమానా విధించేలా కొత్త గెజిట్ విడుదలైంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అకౌంట్‌లలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయని అకౌంట్లు రద్దు కానున్నాయి.

 

మామూలుగా సాధారణ ఎకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ పెట్టకపోతే బ్యాంకులు జరిమానా విధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసినదే. తాజాగా 500 రూపాయలు మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే జరిమానా అనే రూల్ ప్రవేశపెట్టడంతో చాలామంది పోస్టాఫీసుల్లో ఖాతాదారులు వచ్చిన ఈ కొత్త రూల్ పై మండిపడుతున్నారు. దీనివల్ల పేద మరియు మధ్యతరగతి ఖాతాదారులు తీవ్రంగా నష్టపోతారని పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఉంటుందని మరికొంతమంది వచ్చిన కొత్త రూల్ పై కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: