పల్నాడులో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఓ వైద్యుడిపై జరిగిన దాడి ఘటనపై అవకాశం కోసం టీడీపీ ఎదురుచూస్తుంటే, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. తప్పు చేసిన వాళ్లు తమవాళ్లైనా వదిలేదని అధికారపార్టీ  తెగేసి చెప్పడంతో టీడీపీ డైలమాలో పడింది.

 

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఇటీవల వైద్యుడి పై దాడి ఘటన తీవ్ర స్దాయిలో కలకలం రేపింది. ప్రైవేట్ పంచాయితీ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో గురజాల ఎమ్మెల్యే mahesh REDDY' target='_blank' title='కాసు మహేష్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాసు మహేష్ రెడ్డి అనుచరులు ఇన్వాల్వ్ అవ్వడంతో ఆ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వెంటనే దాడికి గురైన వైద్యున్ని కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడ్డ తన వ్యక్తిగత సిబ్బందిపై కేసు పెట్టించారు. తప్పు చేసిన వాళ్లెవరైనా చట్టం ముందు సమానులేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

 

ఇక్కడే అసలు సమస్య మెదలైంది. అధికారపక్షానికి చెందిన కార్యకర్తల పైనే ఎమ్మెల్యే దగ్గర ఉండి పోలీసు కేసు పెట్టించడంతో అసంతృప్తి మెలైంది..పార్టి కోసం ఎంతో కష్టపడిన తమను చివరకు పోలీసు కేసు నమోదు కావటంపై వైసీపీ క్యాడర్ కు మింగుడుపడని అంశంగా మారింది. గతంలో గురజాలలో పార్టి కార్యకలాపాలు పర్యవేక్షించిన పిన్నెల్లి వద్దనే వైసీపీ క్యాడర్ పంచాయితీ పెట్టింది.  అందర్నీ కాకపోయినా కనీసం ఒకరిద్దరు కార్యకర్తలను అయినా బయటకు తీసుకురావాలని మెరపెట్టుకున్నారంట. అయితే అదికార పక్షంలో ఏర్పడిన సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్షం టీడీపీ కూడ రంగంలోకి దిగింది.దాడికి గురయిన వైద్యుడిని సంప్రదించారు. కానీ సదరు వైద్యుడికి అప్పటికే ఎమ్మెల్యే భరోసా ఇవ్వటంతో రాజకీయం వద్దని తెగేసి చెప్పేశారట.

 

టీడీపీ మాత్రం ఈ అంశాన్ని నియోజకవర్గంలో ప్రధానంగా ప్రచారం చేస్తోంది. వైద్యుడిపై అధికారపక్షానికి చెందిన కార్యకర్తలే దాడి చేసి,  వాళ్లే బాధితులను ఆదుకుంటామని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు మాజీ 
పల్నాడు ప్రాంత రాజకీయాల్లో ఏం జరిగినా సంచలనంగానే మారుతోంది.మెన్నటికి మెన్న వైసీపీ బాధితులు పేరుతో టీడీపీ చేసిన ఆందోళనలు కలకలం రేపాయి..ఇప్పుడు మరో సారి వైద్యుడి పై జరిగిన దాడి ఘటనలో రెండు పార్టిల నాయకులు ఎవరి వారు పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: