కియా మోటార్స్ ప్లాంట్ తమిళనాడు తరలిపోతుంది అనే కథనాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖ ద్వారా పవన్ జగన్ ను చాలా విషయాలపై ప్రశ్నించారు .పవన్ రాసిన లేఖలోని కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే... రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోంది. 


ఉన్న పరిశ్రమలు, సంస్థలు వెళ్లిపోతుంటే ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి..? కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయి అని వస్తున్న వార్తలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఈ వార్తను ప్రపంచానికి తెలియజేసింది ఏదో ఆషామాషీగా సంస్థ కాదు. రాయిటర్స్ అనే ప్రఖ్యాత వార్తా సంస్థ వెల్లడించింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కూడా ఇక్కడ బహుముఖంగా తన ఫ్లాట్ విస్తరిస్తుంది అనుకుంటే.. ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధపడడం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తెలియజేస్తోంది. ఇలా అనేక వాటి గురించి చర్చిస్తూ పవన్ జగన్ కు లేఖ రాయడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది.

 

 రాయిటర్స్ కథనంపై కియా మోటార్స్ సంస్థ ఇప్పటికే తన స్పందనను కూడా తెలియజేసింది. తమ ప్లాంట్ ను తమిళనాడు కు తరలించడం లేదని, అనంతపురం జిల్లాలోనే ప్లాంట్ ఉంటుంది అంటూ ప్రకటించింది. అసత్య కథనాలను ఎవరు నమ్మవద్దని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది అని ప్రకటించింది. వీటిని పవన్ పరిగణలోకి తీసుకోకుండా కేవలం వార్తాకథనం ప్రసారం చేసింది కాబట్టి అదే నిజం అంటూ పవన్ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన రాజకీయ జ్ఞానాన్ని తెలియజేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.


 తరలిపోతుందని రాయిటర్స్ సంస్థ కథనం ప్రసారం చేస్తే, ఎక్కడికి వెళ్లడం లేదని స్వయంగా కియా మోటార్స్  స్పందించినా పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా బురద జల్లాలనే విధంగా లేఖ రాస్తూ హడావుడి చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కియా మోటార్స్ విషయంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు లభించేలా పవన్ కూడా జగన్ కు లేఖ రాయడం విమర్శల పాలవుతోంది. కేవలం మీడియా కథనాలు ఆధారంగా చేసుకుని పవన్ విమర్శలు చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. 


కియా మోటార్స్ సంబంధించి వార్తాకథనం ప్రసారం చేసిన రాయిటర్స్ విశ్వసనీయత గురించి చెప్పుకోవాలంటే... గతంలో కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో ఇదే తరహాలో దేశంలో అల్లకల్లోలం జరిగిపోతుందని, ప్రపంచ దేశాల్లో భారత్ చులకనవుతోంది అంటూ కథనాలు ప్రచారం చేసి అభాసుపాలయ్యింది. అదేవిధంగా ఇప్పుడు కియా మోటార్స్ విషయంలోనూ ఏపీ లోని ఒక పార్టీకి అనుకూలంగా కథనాలు ప్రచారం చేసి అదే స్థాయిలో అభాసుపాలవుతోంది. పవన్ కూడా వెనకా ముందు ఆలోచించకుండా వాళ్లు కథనం  ప్రచారం చేశారు కాబట్టి మీరు సమాధానం చెప్పాలి అని నిలదీయడం ఆయన రాజకీయ పరిజ్ఞానంపై సందేహాలను లేవనెత్తుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: