ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సుపుత్రుడు, ట్విట్టర్ పిట్టా, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, ఏపీ పప్పు అని పిలువబడే నారా లోకేష్ కూడా సెటైర్లు వేస్తున్నాడు. అవును నారా లోకేష్ అన్ని పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక్క పేరు చెప్తే ఆయన్ని గుర్తు పట్టలేం కదా.. అందుకే ఆయనకు అన్ని పేర్లు. సరే.. ఇప్పుడు నారా లోకేష్ పేర్ల గురించి పక్కన పెడితే అయన ఈరోజు ట్విట్టర్ వేధికగా చేసిన ట్విట్ గురించి తెలుసుకుందాం.. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నారా లోకేష్ ఈరోజు ట్విట్టర్ వేధికగా వైసీపీ ఎంపీపై సెటైర్ వేశాడు.. నిన్న లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీపై చేసిన ఆరోపణలపై నారా లోకేష్ సెటైర్లు వేశాడు.. అవి ఏం అని అంటే.. ''అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా 'ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ' అంటూ పార్లమెంటులో వైకాపా ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిదా చేసింది'' 

 

''ఫ్రాంక్లిన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ కదా.. అలాంటి ఆ కంపెనీలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని వైఎస్ జగన్ గారిని నిలదీయండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ ఎంపీ గారు. ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకి రావడం జగన్ గారికి మొదటి నుండీ ఇష్టం లేదు.. ఉత్తరాంధ్ర యువతకి మంచి కంపెనీలో ఉద్యోగాలు రావడం వైకాపా నాయకులకు రుచించడం లేదు. ఎప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండాలి అనే దురుద్దేశంతో కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారు. బినామీ కంపెనీలు అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే కంపెనీలు జగన్ గారిని చూసి బై బై ఎపి అంటున్నాయి'' అంటూ ట్విట్ చేశారు. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు..''నోరు మూసుకో.. ఉత్తరాంధ్రకు మీరు వెలగబెట్టింది ఏమి లేదు.. గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు.. ఇప్పుడు ఓ వంకరలు తిరిగి పోతున్నావు.. సవతి తల్లి ప్రేమ.. అంటూ ట్విట్ చేశారు. మరొకరు కామెంట్ చేస్తూ.. మీ టాంగ్ స్లిప్ ముందు అది ఎంత అండి.. ఇప్పటికైనా తెలుసుకున్నారా ? వర్ధంతికి.. జయంతికి తేడా? అంటి నెటిజన్లు తిరిగి సెటైర్లు వేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: