ప్రస్తుతం రాజధాని చుట్టు తిరుగుతున్న ఏపీ రాజకీయాలు...మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు చుట్టు నడవనున్నాయి. అతి త్వరలోనే ఏపీలో స్థానిక ఎన్నికల సందడి నెలకొననుంది. ఇక ఎన్నికల్లో గెలిచేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలవడం పక్కా. ఆ పార్టీకి ఉన్న 151 ఎమ్మెల్యేలు ప్లస్ ఇద్దరు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యే బలం లెక్క వేసుకుంటే స్థానిక ఎన్నికల్లో దాదాపు 80 శాతంపై స్థానాలు వైసీపీనే దక్కించుకునే అవకాశముందని తెలుస్తోంది.

 

కాకపోతే ప్రభుత్వంపై వస్తున్న కొంత నెగిటివ్ ప్రచారం వైసీపీకి దెబ్బ కొట్టేలా ఉందని రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఉందని, అమరావతికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీకి ఇబ్బందికర పరిస్తితులు తలెత్తోచ్చని అంటున్నారు. పైగా టీడీపీ కూడా రాజధాని విషయంపై వైసీపీ మీద నెగిటివ్ ప్రచారం చేస్తుంది.

 

ఇక దీనికి తోడు ఇటీవల పెన్షన్స్, అమ్మఒడి, రైతు భరోసా లాంటి పథకాలపై టీడీపీ నెగిటివ్ తీసుకొస్తుంది. అమ్మఒడి అర్హులైన అందరికీ రాలేదని, కొందరు ధనికులకు కూడా వచ్చిందని చెబుతున్నారు. ఇటు తాజాగా రాష్ట్రంలో చాలామంది పెన్షన్స్ పీకేశారని, జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తన అనుకూల మీడియా ద్వారా రచ్చ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నిజంగానే కొందరికి పెన్షన్లు కట్ అయ్యాయి.

 

కాని వాటిల్లో కొన్ని సాంకేతిక లోపాలు ద్వారా అయితే, మరికొన్ని కొడుకులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు పోయాయి. వీటి వల్ల పెద్ద కొంపలు మునిగిపోయేదేమీ లేదు గానీ, పెన్షన్ కట్ అయినవారు ఎక్కువగా ‘జగన్ మా పెన్షన్ తీసేశాడు’ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయనపై నెగిటివిటీ పెరుగుతుంది. అయితే పెన్షన్లు గానీ, ఇతరత్రా పథకాలు అందినవారు మాత్రం సైలెంట్‌గా ఉండిపోవడం, పథకాలకు అనర్హులైన వారు హడావిడి చేయడం వల్ల జగన్ ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది. మరి చూడాలి ఈ పరిణామాలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో? 

 

మరింత సమాచారం తెలుసుకోండి: