సాధారణంగా అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా...ఒక్కసారే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోకుండా, దశల వారీగా మంత్రివర్గ విస్తరణ చేసి పాలన చేస్తారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం దీనికి విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి మంత్రివర్గం ఏర్పాటు చేసి పాలనలో దిగేశారు. కాకపోతే మంత్రివర్గం ఏర్పాటు చేసేటప్పుడే జగన్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు అవకాశం దక్కినవారికి రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి పదవి ఉండటం కష్టమని ముందే చెప్పేశారు. అయితే మంచి పనితీరు కనబరిస్తే మాత్రం కొనసాగిస్తానని, లేదంటే పక్కనబెట్టేసి వేరే వాళ్ళకు అవకాశం కల్పిస్తానని చెప్పారు.

 

ఇక జగన్ అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటింది. ఇంకా 22 నెలల్లో అంటే దాదాపు రెండేళ్లలో మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశముంది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఓ మంత్రి పదవి పోవడం ఖాయమని అంటున్నారు. రాయలసీమకు చెందిన ఆ జూనియర్ మంత్రి ఇప్పటికీ తన శాఖపై పట్టు తెచ్చుకోలేదని, ఇటు అధికార పార్టీ నేతగా కూడా ప్రతిపక్షాలపై దూకుడు వెళ్ళడం లేదు. అలాగే సొంత నియోజకవర్గంలో పెద్దగా ఎఫెక్టివ్‌గా పని చేయడం లేదని తెలిసింది.

 

పైగా ఇటీవల నియోజకవర్గంలో మంత్రుల అనుచరుల దందాలు ఎక్కువైపోయాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ సదరు నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని భావించిన నేపధ్యంలో మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున దందాలకు దిగారని ఆరోపణలు వచ్చాయి. ఇంటి పట్టా మంజూరు చేయిస్తామంటూ మంత్రి అనుచరులు ఓ గ్రామానికి చెందిన పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారని, ఒక్కొక్కరి నుండి 20 వేలు వసూలు చేసి ఇంటి స్థలం ఇవ్వలేదని తెలిసింది. 

 

ఇక బాధితులు కూడా అనుచరులపై ఎదురుతిరిగి పోలీస్ స్టేషన్ల ముందు గొడవలు చేసినా...మంత్రి పట్టించుకోలేదని తెలిసింది. ఇక ఈ పరిణామాలని చూసుకుంటే అన్నీ మంత్రికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో ఈయన పదవి వచ్చే రెండేళ్లలో పోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: