రాజధాని విషయంలో ఎల్లోమీడియా ఎంతగా గుండెలు బాధుకుంటోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.  రాజధాని ఏర్పాటు విషయంలో తన ప్రమేయం ఏమీ ఉండదని కేంద్రం పదే పదే చెబుతున్నా ఎల్లోమీడియా మాత్రం అంగీకరించటం లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి  జోక్యం చేసుకవాల్సిందే అంటూ కేంద్రాన్ని  ఒత్తిడి పెడుతోంది.  ఎల్లోమీడియా ప్రకారం రాజధాని ఎంపిక నుండి నిధుల కేటాయింపు వరకూ కేంద్రం పాత్ర ఉందంటూ తప్పుడు కథనాలను వండి వారుస్తోంది.

 

వాస్తవం ఏమిటంటే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయటంలో  రాష్ట్రంలోని పార్టీలకే ఏమీ సంబంధం లేకుండా చేసేశారు చంద్రబాబునాయుడు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినపుడు చంద్రబాబు కేంద్రం అభిప్రాయాన్ని కానీ అనుమతిని కానీ తీసుకోలేదు. రాజధానిగా అమరావతిని ఏకపక్షంగా నిర్ణయించేసి అసెంబ్లీలో ప్రకటించేశాడన్నది వాస్తవం.

 

రాజధానిగా అమరావతిని చంద్రబాబు ఎంపిక చేసినపుడు కేంద్రం అడ్డు చెప్పలేదు. అలాగే ఇపుడు జగన్ మూడు రాజధానులన్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. వాస్తవం ఇలాగుంటే ఎల్లోమీడియా మాత్రం జగన్ ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ కథనాలను వండి వారుస్తునే ఉన్నాయి వరుసగా.  రాష్ట్రప్రభుత్వ అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్రం ఎన్నిసార్లు బహిరంగంగా చెప్పినా కూడా ఎల్లోమీడియా పట్టించుకోవటం లేదు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే రాజధానిగా అమరావతే కంటిన్యు అవటం చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాకు కూడా బాగా ప్రిస్టేజ్ అయిపోయినట్లుంది. బహుశా ఈ మీడియా అధిపతులకు కూడా అమరావతి ప్రాంతంలో భూములున్నాయో ఏం పాడో. అందుకనే సొంతంగా ప్రతిరోజు జగన్ కు వ్యతిరేకంగా కథనాలు అచ్చేసొదులుతున్నారు.  నిజానికి రాజధాని గ్రామాల్లో ఆందోళనలు పెద్దగా జరగటం లేదనే చెప్పాలి.

 

ఎందుకంటే జరుగుతున్న ఆందోళనల్లో, పాల్గొంటున్న వాళ్ళల్లో ఎక్కువగా పెయిడ్ ఆర్టిస్టులున్నారనే వైసిపి ఆరోపణలు వాస్తవాలే అనిపిస్తోంది. ఏదేమైనా ఆందోళనల వేడిని తగ్గకుండా చూడటంలో ఎల్లోమీడియా గుండెలు బాధుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: