ప్రపంచ దేశాలను వణికించేస్తున్న పేరు కరోనా. చైనా దేశంలో వూహాన్‌ నగరంలో బయటపడిన ఈ వైరస్ చైనీయుల తో పాటు ప్రపంచాన్ని గజగజలడిస్తోంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ సోకిన వారు దాదాపు నెల రోజుల్లోనే పిట్టల్లా రాలిపోతున్నారు. మరణకరమైన ఈ వ్యాధి అంటువ్యాధిలా వ్యాప్తి చెందడంతో చైనా ప్రభుత్వం ఈ వైరస్ అరికట్టడానికి నానా తిప్పలు పడుతుంది. ఈ నేపథ్యంలో చైనాలో ఒక నగరం నుండి మరొక నగరానికి రాకపోకలను పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా వూహాన్‌ నగరంలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా చైనా వైద్యబృందం ఆధీనంలోకి తీసుకుంది. ఆ నగరం నుండి ఎవరిని బయటకు రావటం లేదు మరొకరిని లోపలికి వెళ్ళిన ఇవ్వటంలేదు చైనా ప్రభుత్వం.

 

ఇటువంటి నేపథ్యంలో వూహాన్‌ నగరం నుండి పాకిస్తాన్ మరియు భారతీయులను తమ స్వదేశాలకు పంపించే విధంగా వారికి అన్నీ వైద్య పరీక్షలు నిర్వహించిన చైనా ప్రభుత్వం..రెండు దేశాలకు చెందిన పౌరులను పంపడానికి సిద్ధమైనట్లు రెండు దేశాలకు సమాచారం అందించింది. ఈ మేరకు కరోనా విషయంలో మోడీ సర్కార్ అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. పొరుగుదేశం శత్రు దేశమైన పాకిస్థాన్ కి సహకారం అందించడానికి మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా దేశంలో వూహాన్‌ నగరంలో ఉన్న పాకిస్థానీయులను తమ దేశంలోకి తీసుకురావటానికి తమ దగ్గర వైద్యబృందం అంతగా లేదని..కరోనా వైరస్ ని ఎదుర్కోగల శక్తి తమకు లేదని పాక్ విద్యార్ధులంతా వూహాన్‌లోనే ఉండిపోవాలని పాక్ ప్రభుత్వం సూచించింది.

 

దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి చైనా దేశంలో వూహాన్‌ నగరంలో ఉన్న పాకిస్తాన్ విద్యార్థులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతేకాకుండా ఇమ్రాన్ సర్కారు అసమర్థతపై దుమ్మెత్తిపోశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్థాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో కష్టాల్లో ఉన్న పాక్ విద్యార్ధులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ముందుకు వెళ్లింది. ఆ ప్రాంతంలో ఉన్న పాకిస్తానీ లను అన్ని విధాల కరోనా వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పాకిస్తానీ లను పాకిస్తాన్ దేశానికి పంపించడానికి భారత సర్కార్ రెడీ అయింది. దీంతో భారత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: