హైదరాబాద్ లో ఇద్దరికి  కరోనా వైరస్ సోకినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు . హైదరాబాద్ లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు , పదుల సంఖ్యల లో అనుమానిత కేసులు నమోదయినట్లు సోషల్ మీడియా లోనే కాకుండా, ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలోను వార్త ప్రచురితం కావడం తో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు .

 

చైనా నుంచి వచ్చిన ఇద్దరు టెక్కీలకు కరోనా వైరస్ సోకినట్లు , వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు వార్త కథనం ప్రచురించారు . అంతేకాకుండా పలు అనుమానిత కేసులు కూడా నమోదుయినట్లుగా పేర్కొన్నారు . దాంతో నగరవాసులు ఆందోళన చెందడం ప్రారంభించారు . ఇప్పటికే ఏ నల్గురు కలిసి కరోనా వైరస్ గురించే చర్చించుకుంటున్న తరుణం లో ... ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లుగా వార్త  ప్రచురితం కావడంతో , సోషల్ మీడియా లో కొంతమంది మరింత రెచ్చిపోతున్నారు . అయితే ఈ వార్తల పై అధికారికంగా మంత్రి వివరణ ఇచ్చారు . అవును .. చైనా నుంచి వచ్చిన  ఇద్దరికి  కరోనా వైరస్  పరీక్షలు చేసిన మాట నిజమే కానీ వారి రక్త నమూనాలను పూణే కు పంపమన్నది అబద్దం .

 

ఎందుకంటే కేంద్రం కరోనా వైరస్ పరీక్ష   కిట్స్  అందజేసింది . ఇక్కడే వారికి పరీక్షలు నిర్వహించి , క్రాస్ చెక్ చేసుకునేందుకు రెండవసారి పరీక్షలు నిర్వహించామని చెప్పారు . లక్షలాది మంది హాజరవుతున్న సమ్మక్క , సారక్క జాతరలోను కరోనా వైరస్ ప్రభావమేమి లేదని చెప్పారు . వేసవి కాలం ప్రారంభం కావడంతో కరోనా వైరస్ ప్రభావం తగ్గే అవకాశాలున్నాయన్న ఈటెల , ప్రజలు ముందు జాగ్రత్తతో ఉండడం మంచిదేనని సెలవిచ్చారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: