ప్రస్తుతం పట్టణాల్లో నివసించే ఇంటర్నెట్ లేనిదే జీవితం గడవదు.. అంతలా మనం ఇంటర్నెట్ పై డిపెండ్ అయ్యాం.. ఇంటర్నెట్ కి అడిక్ట్ అయ్యాం.. తిండి తినాలన్న ఇంటర్నెట్.. కూరగాయలు కావాలన్నా ఇంటర్నెట్, బట్టలు కొనాలన్నా ఇంటర్నెట్.. అంతేకాదు ఇంకా ఏమి కావాలన్నా ఇంటర్నెట్ ఉండాల్సిందే. 

                   

అలాంటి ఇంటర్నెట్ ని ప్రాథమిక హక్కు కాదు అని అన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. నిన్న గురువారం రాజ్యసభలో అయన ఈ మాట అన్నారు. ఆలా ఎందుకు అన్నారు అంటే.. దేశ భద్రతా పరిస్థితుల ప్రాధాన్యతను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అయన అన్నారు. 

                  

ఇంటర్నెట్ ఎంత మాత్రం దేశ భద్రతతో సమానమైన ప్రాధాన్యత కాదు అని అయన తేల్చేసారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన రవిశంకర్ ప్రసాద్ ఇంటర్నెట్ హక్కు ప్రాథమిక హక్కేనని ఏ న్యాయవాది సుప్రీం కోర్టులో వాదించలేదని, ఈ రకమైన గందరగోళాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అయన అన్నారు. 

                   

'మీ అభిప్రాయాలు, ఆలోచనలు తెలియజేయడం కోసం ఇంటర్నెట్ ఉపయోగించుకోవడమన్నది ప్రాథమిక హక్కే' అని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది అని గుర్తు చేశారు. ఉగ్రవాదం, హింసాకాండను ప్రేరేపించడానికి ఇంటర్నెట్‌ను వాడుకోవడాలు ఎవరూ సహించరని, కాశ్మీర్‌లో పాకిస్తాన్ చేస్తున్న పని ఇదేనని, ఇంటర్నెట్ కారణంగానే ఐఎస్‌ఐఎస్ బలపడిందని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ వాడుకోవడం ఎంత ముఖ్యమో దేశ భద్రత కూడా అంతే ముఖ్యమా నాయి అయన అన్నారు. అయితే ఇంటర్నెట్ వాడకం అనేది ఏ మాత్రం సమానం అయినది కాదని అయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: