కేరళలోని కొల్లాం జిల్లాకు వలస వచ్చిన అబ్దుల్ అలీ, తన సమీప బంధువు జలాలుద్దీన్, ఇంకా తన స్నేహితుడు కలిసి అంచల్ పట్టణంలోని ఒక మాంసం దుకాణం లో పనిచేస్తున్నారు. అయితే, నిన్న ఉదయం అబ్దుల్, జలాలుద్దీన్ మధ్య సెల్ ఫోన్ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో వారిద్దరి మధ్య కొట్లాట జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన అబ్దుల్ తాను ప్రతిరోజు చికెన్ ని నరికే కత్తిని తీసుకొని విచక్షణ రహితంగా జలాలుద్దీన్ ని పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన జలాలుద్దీన్ అక్కడికక్కడే తన శ్వాస విడిచాడు. అయితే గది లోనే ఉన్న స్నేహితుడు వీరిద్దరిని విడిపించే క్రమంలో అతడికి కూడా కత్తిపోట్లు తగిలి మరణించాడు. 

 

 

ఈ దారుణాన్ని ఇద్దరు వ్యక్తులు ఆపే ప్రయత్నం చేశారు కానీ... అబ్దుల్ వారికి కత్తి చూపించి బెదిరించడం తో వారు పారిపోయారు. తరువాత ఈ కిరాతకం చేసిన అబ్దుల్ అలీ రక్తపు మడుగులో ఉన్న తన సమీప బంధువు మతదేహాన్నితో ఒక సెల్ఫీ వీడియో తీసి దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జతచేసి సామాజిక మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. మరోవైపు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే నిందితుడు అబ్దుల్ అలీ కత్తితో తనపై తాను దాడి చేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అందుకే ప్రస్తుతం గాయపడిన నిందితుడిని తిరువంతపురంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత విచారణ చేపడతామని పోలీసులు చెప్పుకొస్తున్నారు. 

 

 


మరోవైపు జలాలుద్దీన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. దానిని అస్సాం లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఏదేమైనా కేవలం మొబైల్ ఫోన్ విషయంలో ఎంతో కాలంగా కలిసి నివసిస్తున్న సమీప బంధువుని, అతడి స్నేహితుడిని చంపడం చాలా విషాదకరం. మళ్లీ అతడేదో ఘనకార్యం చేసినట్లు కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయడం అనేది అతడిలోని కిరాతక లక్షణాలని ఉట్టిపడేలా చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: