ప్రభుత్వ ఉద్యోగులందరికీ రెండవ శనివారం ఆదివారం కూడా సెలవు దినంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి నెలలో రెండో శనివారం సహా ఆదివారం కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ సెలవు దినాలు . ఆ రోజున ఏ ప్రభుత్వ కార్యాలయాలు కూడా పని చేయవు. అయితే నేడు రెండవ శనివారం సందర్భంగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ శనివారం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ సెలవు లేదని... పనిదినం  గానే పరిగణించాలి అంటూ ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వులు జారీ అయినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్  ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 1న పని దినం రోజున  కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికి  సెలవు ప్రకటించిన నేపథ్యంలో... జనవరి పనిదినం  రోజు సెలవు తీసుకున్నందున ఫిబ్రవరి 8వ తేదీన రెండో శనివారం రోజు  అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. 

 


 కావున రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి  రెండవ శనివారం నాడు పని దినంగానే భావించి ప్రభుత్వ కార్యాలయాలకు హాజరు కావాలని తెలిపారు. జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ తో పాటు అన్ని జూనియర్ సర్కిల్ కార్యాలయాలు యధావిధిగా పని చేయాలని ఆయన తెలిపారు. ఈ విషయంపై డెప్యూటీ  అడిషనల్ కమిషనర్ సహా హెచ్ఒడి  లు తమ పరిధిలోని ఉద్యోగులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని రెండవ శనివారం నాడు కార్యాలయాలకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. అయితే గతంలో కూడా పని దినం నాడు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించినందుకుగాను ఇలాగే రెండవ శనివారం పనిదినంగా  మార్చినది  ప్రభుత్వం. 

 

 దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల నిరవధికంగా విధులను బహిష్కరించారు. దీంతో  రాష్ట్రంలోని విద్యార్థుల ఎవరు బస్సు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడకూడదు అని ఉద్దేశంతోనే దసరా సెలవులలో రెండు సార్లు పొడిగించింది ప్రభుత్వం... దాదాపు నెల రోజుల పాటు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రకటించిన సెలవుల కారణంగా విద్యార్థుల చదువులు దెబ్బతినకూడదని ఉద్దేశంతో ఆ తర్వాత స్కూలు సెలవుల కాలంలో ఆగిపోయిన పాఠాలను  పూర్తిచేసేందుకు... రెండో శనివారాల్లో కూడా స్కూలు తెరిచి ఉంచాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: