ఏపీ నుంచి కియా మోటార్స్ సంస్థ తరలిపోతోందంటూ రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. కాస్తో కూస్తో పేరున్న రాయిటర్స్ వార్తా సంస్థ నుంచి ఈ కథనం రావడం కలకలం సృష్టించింది. రాయిటర్స్ కథనం ఆధారంగా పలు వార్తా పత్రికలు ఈ కథనం గురించి ప్రచారం చేశాయి. ఇక ఎల్లో పత్రికల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

 

అయితే కియా సంస్థ తరలింపు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్వయంగా ఆ సంస్థ ఎండీయే మీడియా ముందుకు వచ్చి మరీ వివరణ ఇచ్చారు. కాబట్టి అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో దిమ్మతిరిగే న్యూస్ వచ్చింది. అదేంటో తెలుసా.. త్వరలోనే ఏపీలో మరో కియా ప్లాంటు రాబోతోందట. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

 

 

ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన కియా మోటార్స్‌ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై నమ్మకంతో కియా మోటార్స్‌ మరొక పరిశ్రమను కూడా పెట్టబోతోందని తెలిపారు. జూలై నెలలో మరో కియా ప్లాంట్‌ వస్తుందన్నారు. కియా మోటార్స్‌ తమిళనాడుకు వెళ్తోందని టీడీపీ నేతలు విషప్రచారం చేశారని, కానీ, కియా మోటార్స్‌తో మాట్లాడలేదని తమిళనాడు ప్రభుత్వమే స్వయంగా చెప్పిందన్నారు.

 

 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారని, ఒప్పందాలను గౌరవిస్తూ అమలు చేస్తున్నాం. శ్రీ సిటీ కంటే మెరుగైన దానిని తీసుకొచ్చేందుకు పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి గౌతం రెడ్డి వివరించారు. చంద్రబాబు దిగజారి మాట్లాడడం బాధాకరమని, మా ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి విషప్రచారం చేయిస్తున్నాడని మంత్రి గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: