రాజకీయాల్లో గెలుపు అనేది చాలా ముఖ్యం. పోటీ చేసిన ప్రతి పార్టీ, అభ్యర్థి ఎన్నికల్లో తప్పకుండా గెలిచి తీరాలనే కసితో పనిచేస్తుంటారు.ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీల నాయకులు ఏమి చేసేందుకైనా వెనుకాడరు. ఎన్నికల్లో గెలవాలంటే ఎన్ని రకాల వ్యూహాలు వేయాలో అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తూ గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. శనివారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో  ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం నుంచి ఎన్నికల ప్రచారానికి తెర పడటంతో అసలు సిసలైన ఎత్తుగడలకు రాజకీయ పార్టీలు తెరతీశాయి.


 ఎన్నికల సందర్భంగా మద్యం, మత్తు పదార్థాలు కూడా పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. ఎన్నిఅలాగే ఈ పార్టీపార్టీ అని తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలు ఉల్లంఘించి మరి వ్యవహరించాయని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. పార్టీల నుంచి మొత్తం 52 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా మొత్తంరూ.5.87 కోట్లు విలువ చేసే డ్రగ్స్ మరియు నార్కోటిక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఈసి తెలిపింది. అలాగే ఎన్నికల ప్రచారం సందర్భంగా రూ.32.18 కోట్లు విలువ చేసే బంగారం ఉండగా.. వెండి ఇతర వస్తువులు కలిపి రూ.2.16 కోట్లు ఉందని ఈసీ తెలిపింది.


వీటితో పాటు ప్రెషర్ కుక్కర్లు, చీరెలు ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.  వీటిలో ఎవరి పాత్ర ఉందనే విషయంపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా ఆయుధాల చట్టం కింద 402 కేసులు నమోదయ్యాయి. 440 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఆయుధాల స్మగ్లింగ్ కేసులో అరెస్టయినట్లు సమాచారం. పోలీసులు అన్ని మార్గాలను గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రతి వాహనాన్ని తనిఖీ చేపడుతున్నారు. ఇక మద్యం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎక్కడికక్కడ ఏరులై పారుతోంది. ఈ వ్యవహారాళ్ళనీ మీడియాలో హైలెట్ అవుతుండడంతో అయ్యబాబోయ్ ఇంత అరాచకంగా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: