ఏపీ ప్రభుత్వం వేధింపులు, మితిమీరిన నిబంధనల కారణంగా ప్రపంచ ప్రఖ్యాత కార్ల దిగ్గజ సంస్థ అనంతపురం జిల్లాలో నిర్మించిన కియా మోటార్స్ కంపెనీని ఇక్కడ నుంచి  తమిళనాడుకు తరలించబోతోదని, ఇదంతా వైసీపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మేరకు రాయిటర్స్ జాతీయ మీడియా ఒక ప్రత్యేక కథనం ప్రచారం చేసింది. దీంతో ఏపీలో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. వైసీపీ ప్రభుత్వం ఇదంతా అసత్యమని, ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చేందుకు ఇలా తప్పుడు కథనాలు ప్రచారం చేసి అభాసుపాలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు.  అయినా ఈ వ్యవహారాన్ని పెద్దది చేస్తూ వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోయారు. 


దీనిపై టీడీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా అదే పనిగా కథనాలు ప్రచారం చేసి అగ్గికి ఆజ్యం పోశాయి. ఇదే సమయంలో ఈ కథనాన్ని ఆధారం చేసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ అనేక విమర్శలు చేస్తూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కియా మోటార్స్ ఎండీ దీనిపై స్పందించారు. తాము తమ ప్లాంట్ ను అనంతపురం జిల్లా నుంచి తమిళనాడుకు తరలిస్తున్నామన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, దయచేసి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఎండీ తన వివరణను కంపెనీ ప్రతినిధి ద్వారా తెలియజేసారు. మా ఫ్యాక్టరీ ద్వారా అనంతపురం జిల్లా నుంచి ప్రపంచ స్థాయి వాహనాలను తయారు చేస్తుందని వివరించారు. 


ఈ మేరకు శుక్రవారం కంపెనీ ప్రతినిధి ఎండీ సందేశాన్నిచదివి వినిపించారు. అనంతపురం నుంచి కియాను తరలిస్తున్నామన్న  వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. కంపెనీని అనంతపురం నుంచి ఎక్కడికి తరలించమని, తరలించాలని అనుకోవడం లేదని ఆమె స్పష్టం గా పేర్కొన్నారు. దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు నోర్లు మూతపడ్డాయి. స్వయంగా ఆ కంపెనీ ఎండీనే ఈ వ్యవహారంపై స్పందించడంతో రాయిటర్స్ లో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం అనేది తేలిపోయింది. ఇది కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికే ఇలా అనవసర రాద్ధాంతం అంటూ విమర్శలు వస్తున్నాయి. కియా మోటార్స్ క్లారిటీ ఇచ్చిన తర్వాత దీనిపై స్పందించేందుకు టిడిపి, జనసేన నాయకులు సైతం నిరాకరించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: