గురువు అంటే తండ్రి అని చాలా మంది అంటున్నారు...అలాంటి తండ్రి బుద్దులు చెప్పాల్సింది పోయి బుద్ది తక్కువ పని చేస్తున్నారు.. చదువు చెప్పాల్సిన గురువు గాడి తప్పుతున్నారు..చావు చెప్తాను స్పెషల్ క్లాస్ అంటూ ఇంటికి రమ్మని చెప్పి వారికి అశ్లీల చిత్రాలను చూపిస్తూ అరాచకానికి ఒడిగట్టిన ఘటన ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ట్యూషన్ అని చెప్పి మరీ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు..


వివరాల్లోకి వెళితే.. టీచర్ అయి ఉండి బుద్ది తక్కువ పని చేస్తున్నారు ఓ ప్రబుద్ధుడు..దేశంలో చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటన మరోటి వెలుగులోకి వచ్చింది. స్కూల్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక టీచర్ బాగోతం బయటపడింది. అమ్మాయిలను గదిలోకి తీసుకెళ్లి పోర్న్ వీడియోలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విషయం తెలిసినా స్కూల్ యాజమాన్యం అతనిపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకురావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

 


ఔరంగాబాద్‌లోని ఓ స్కూల్ టీచర్ ముగ్గురు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేయడంపై కేసు నమోదైంది. తన స్టూడెంట్స్‌పైనే కన్నేసిన కీచక టీచర్.. ముఖ్యమైన పని ఉందంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికలను తన క్యాబిన్‌కి తీసుకెళ్లాడు. టీచర్ పిలిచాడని వెళ్లిన విద్యార్థినులకు అక్కడ షాకింగ్ ఘటన ఎదురైంది.

 


తన ఫోన్ తీసి అందులో పోర్న్ వీడియోలు ఆన్ చేశాడు టీచర్. విద్యార్థిలనులకు ఆ సెక్స్ వీడియోలు చూపించాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు.. అశ్లీల చిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటన జనవరి మొదటి వారంలో జరిగినట్లు తెలుస్తోంది. టీచర్ పోర్న్ వీడియోలు చూపిన విషయాన్ని విద్యార్థినులు బయటకు చెప్పలేకపోయారు...అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసుల చేతిలో పిచ్చు కొట్టుడు తింటున్నాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: