ఈ మధ్య కాలంలో మీడియా ఎవరి చేతిలో ఉంటే వారు తాము మద్దతు ఇచ్చే పార్టీలకు అనుకూలంగా మంచిని చెడుగా చెడును మంచిగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. సోషల్ మీడియా వలన ప్రజలకు కొంతవరకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం జర్నలిస్టులు అంటే ఎంతో ఉన్నత గౌరవం దక్కేది. కానీ ఇప్పుడు జర్నలిస్టులను ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. 

 

ఇందుకు కారణం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాల నుండి జర్నలిస్టులు వారి స్వార్థ ప్రయోజనాల కొరకు వారి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతున్నారు. ఉదాహరణకు సీఏఏ విషయంలో మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని కథనాలను క్రియేట్ చేస్తూ ప్రజలపై వ్యక్తిగత అభిప్రాయాలను రుద్దుతోంది. ఇక రాష్ట్రం విషయానికి వస్తే అధికార పార్టీ మీడియా ఒకటి మంచని చెబితే ప్రతిపక్ష పార్టీ అందుకు భిన్నమైన కథనాలను వండివారుస్తోంది.

 

ఉదాహరణకు కియా విషయంలో ఒక ప్రముఖ పత్రికలో కథనం ప్రచురితమైందని ఆ కథనాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానెళ్లు, పత్రికలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రభుత్వం మంచి చేస్తుందంటే ఆ మంచికి సంబంధించిన వార్తలు కనబడవు కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందంటే అందులో కొంత కల్పితాన్ని సృష్టించి మర్రీ మీడియా కథనాలు వండివారుస్తోంది. 

 

మీడియా మద్దతు ఇచ్చే పార్టీలు అధికారంలో ఉంటే రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి అని ముఖ్యమంత్రి మారితే మాత్రం కంపెనీలు పోతున్నాయని ఒక వర్గం మీడియా తెలుగు రాష్ట్రాల్లో దుష్ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం మీడియాలో మనకు నచ్చిన వారు ఏం చేసినా అద్భుతం.. అమోఘం.. వారికి వ్యతిరేకంగా విమర్శలు చేసేవారు మాత్రం దోపిడీదారులు, దొంగలు అనే విధంగా మీడియా వారిని ప్రొజెక్ట్ చేస్తోంది. ఈ తరహా ధోరణి వలన ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు నమ్మాలో వద్దో కూడా ప్రజలకు అర్థం కావటం లేదు. అంటే దీనిబట్టి మీకు ఏం అర్థం అవుతుంది? మీడియా ఆటల్లో అరటి పండు ఎవరు? ఇంకేవరు ? ప్రజలే. అని చెప్పకనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మీరు ఏం అంటారు? 

 

మరింత సమాచారం తెలుసుకోండి: