అమ్మాయిలపై క్షణాలలో అత్యాచారాలు జరుగుతాయి. క్షణాలలో వారిని హింసించి చంపుతారు.. రోజులు తరబడి హింసిస్తారు. కానీ ఆలా హింసించిన వారికీ శిక్ష వెయ్యం.. సంవత్సరాలు సంవత్సరాలు వారిని మేపుతాం.. వారిని జైల్లో ఉంచి హీరోలలా తయారు చేస్తాం.. వారికి నచ్చినట్టు శరీరాన్ని తయారు చేసుకునేలా చేస్తాం. 

 

కావాల్సిన ఆహారం పెడుతం.. శరీరానికి ప్రోటీన్ ఇస్తాం. అప్పుడప్పుడు కోర్టుకు తీసుకెళతాం. తీసుకొస్తాం.. అంతే తప్ప వారికీ శిక్షలు వేయించాం. ఇది మా నైజం.. ఛీఛీ.. 2012లో జరిగిన ఘటనకు ఇప్పటికి ఉరి శిక్ష వెయ్యలేదు.. ఇప్పటికి ఆ తల్లికి కన్నీరు పెట్టిస్తూనే ఉన్నారు.. ఏళ్ళ తరబడి భారత్ సహనాన్ని పరీక్షిస్తున్నారు ఈ నిరక్షలు... ఇంకో 12 గంటల్లో చస్తారు అనుకున్న సమయంలో ఉరి శిక్ష ఆగిపోయింది ఈ నీచులకు. 

 

ఇది ఇంకా ఎప్పుడు పడుతుందో తెలియదు.. మొన్న దిశ ఘటన జరగటం వల్ల ఆ నిర్భయ నిందితులు అంత ఉరి శిక్ష వరుకు వెళ్లారు కానీ లేకుంటే అది కూడా వెళ్లారు.. వాళ్ళను ఎవరు పట్టించుకుంటారు ? చెప్పండి ? ఇప్పుడు మరో దిశ ఘటన జరిగితే తప్ప వీరికి ఉరి శిక్ష పడదు అనే ఆలోచనలోకి వెళ్లిపోయాం.. 

 

ఇంకా అలాంటి ఈ సమయంలో వీరికి ఉరి శిక్ష ఎప్పుడు పడెను? సరే ఇప్పుడు పైన అనుకున్నట్టు పాకిస్థాన్ ఎందుకు మేలు అంటే ఇందుకే.. వారు ఎలాంటి శిక్షలు వెయ్యాలి అని నిర్ణయించుకున్నారో తెలిస్తే మీరు కూడా ఆ మాట అనకుండా ఉండలేరు.. పిల్లలపై అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్‌ పార్లమెంట్‌ శుక్రవారం ఆమోదించింది. అయితే ఆ తీర్మానం మెజారిటీ ఓట్లతో పాసయింది. 

 

ఇప్పుడు చెప్పండి.. వాళ్ళు బహిరంగంగా ఉరి శిక్ష అంటున్నారు.. కానీ మన భారత్ లో అసలు ఉరి శిక్షే పడటం లేదు ఇంకా బహిరంగంగా ఎప్పుడు పడాలి.. మన వారు అన్ని చట్టాలు తెస్తారు.. నిర్భయ చట్టం, దిశ చట్టం ఇంకో చట్టం. ఏ చట్టంలో అయినా ఆడపిల్లకు న్యాయం జరిగింది ఉందా? అసలు జరుగుతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: