ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రతీ విషయంలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే పాలనా పరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్న జగన్‌, చంద్రబాబు అండ్‌ టీంకు దడ పుట్టిస్తున్నాడు. ఏపీలోని టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు కావటం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.

 

గత వారం రోజులుగా ఈ కేసులకు సంబంధించిన వార్తలు మరీ ఎక్కువయ్యాయి. కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత కేఈ ప్రతాప్‌పై నకిలీ మధ్యం కేసు, ఆ తరువాత గుంటూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కూడా వరుసగా కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ కొంతమంది ప్రభుత్వ అధికారులపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. తమ మీద ఎప్పుడు ఎలాంటి దాడి జరగుతుందో అన్న భయం పట్టుకుంది.

 

ఏకంగా మాజీ డిప్యూటీ సీఎం సోదరుడి మీదే నకిలీ మద్యం కేసు నమోదు కావటంతో పాటు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. అదే రోజు చంద్రబాబు వద్ద పీఎస్‌గా సుధీర్ఘకాలం పాటు పనిచేసిన శ్రీనివాస్‌ అనే ప్రభుత్వ అధికారి ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 38 గంటల పాటు వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించారు అధికారులు.

 

దీనికి తోడు అవమరాతిలో ఇన్‌సైడర్‌ ట్రెండింగ్‌ జరిగిందన్న అంశాన్ని కూడా వైఎస్సార్సీపీ నాయకులు ప్రముఖంగా తెర మీదకు తీసుకువస్తున్నారు. 796 మంది తెల్ల రేషన్‌ కార్డుదారులు కూడా కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేయటంతో వాళ్లంత బినామీలే అన్ని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. ఈ కేసును సీఐడీ పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుండటంతో టీడీపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: