యూట్యూబ్.. ఇప్పుడు ఇది అందరి వినోద సాధనంగా మారింది. స్మార్ట్ ఫోన్ల రాకతో ఇప్పుడు అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయింది. అలాగే తెలుగు లోనూ యూట్యూబ్ ఛానల్స్ అలరిస్తున్నాయి. మరి తెలుగులో టాప్ టెన్ యూ ట్యూబ్ ఛానల్స్ ఏంటో తెలుసా మీకు.. యూట్యూబ్ ఛానల్స్ ను ఫాలో అవుతున్నారా..?

 

 

మెయిన్ మీడియాలో కూడా రాని కంటెంట్ ఈ యూట్యూబ్ ఛానళ్లలో వస్తుంది. మరి టాప్ తెలుగు ఛానల్స్ ఏంటో చూద్దాం.. సబ్‌స్ర్కైబర్స్‌ సంఖ్యను బట్టి తెలుగులో టాప్‌ 10 ఛానల్స్‌ ఇవే.. వీటిలో మొదటిది గ్రాండ్‌పా కిచెన్‌, ఇది పల్లెటూరి రుచులు అందిస్తుంది. మహాతల్లి ఛానల్ పూర్తిగా వినోద ప్రధానమైంది. వైవా ఛానల్ కూడా వినోదం అందిస్తుంది. ఇందులో యూత్ కంటెంట్ ఎక్కువ.

 

 

ఇక ఈజీ రంగోలీ అభిరుచుల ప్రధానంగా సాగితే.. తెలుగు టెక్‌ట్యూట్స్‌ ఛానల్ లేటెస్ట్ టెక్నాలజీని అందిస్తుంది. మై విలేజ్‌ షో అనే చానల్ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఛానల్ ద్వారా పరిచయమైన గంగవ్వ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ గా ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లలోనూ సందడి చేస్తోంది. మైనా స్ర్టీట్‌ ఫుడ్‌, ప్రియావంటలు ఛానళ్లు ఫుడ్ ప్రయారిటీగా సాగే ఛానళ్లు. క్రియేటివ్‌ థింక్స్‌ ఛానల్ కూడా పల్లెటూరి జీవితం ఆధారంగా రూపొందింది.

 

 

పైన చెప్పిన టాప్ టెన్ ఛానళ్లతో పాటు తెలుగులో ఇప్పుడు 80కి పైగా ఛానల్స్‌కు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు సబ్‌స్ర్కైబర్స్‌ ను సంపాదించుకున్నాయి. 785కి పైగా ఛానల్స్‌కు లక్ష మంది, 80 ఛానల్స్‌కు పది లక్షల ప్లస్‌ ఖాతాదారు లున్నారు. తెలుగులో కంటెంట్‌ క్రియేటర్లు ఎంత వేగంగా పెరుగుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ యూ ట్యూబ్ ఛానళ్లను ఫాలో అయిపోండి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: