విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి బంగారు తీసుకువస్తున్న వారు విమానాశ్రయాల్లో తరుచూ పట్టుబడుతుంటారు. అయితే ఎంత మంది ఎన్ని సార్లు పట్టుబడినా ఈ తరహా స్మగ్లింగ్‌ కొనసాగుతూనే ఉంది. స్మగ్లర్స్‌ కూడా కొత్త కొత్త దారులు వెతుకుతూ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా ఈ అక్రమ రవాణాకు మహిళలను వాడుకుంటున్న ఉందంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి.


సినిమా తరహాలో జరిగిన ఈ సంఘటనలో స్మగ్లింగ్ చేసేందుకు మహిళ ఎంచుకున్న దారి గురించి తెలుసుకొని ఎయిర్‌పోర్ట్ వర్గాలు, కస్టమ్స్‌ అధికారులు కూడా షాక్‌ తిన్నారు. వివరాల్లోకి వెళితే... బ్యాంకాక్ నుంచి కోల్‌కతా ఫ్లైట్ దిగి వస్తున్న పర్వీన్ సుల్తానా అనే ప్రయాణికురాలి ఎయిర్‌పోర్ట్‌లో తడబడుతున్నట్టుగా కనిపించటంతో అధికారులకు ఆమె మీద అనుమానం వచ్చింది. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను సెక్యురిటీ పోస్ట్ దగ్గర అడ్డుకొని తనిఖీ చేశారు.


ఈ తనిఖీలో ఆమె లోదుస్తులలో మెటల్ దాచినట్లుగా తెలుసుకున్న అధికారులు ఇంటర్నల్ చెకప్‌ కోసం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేసిన మహిళా అధికారులు అవాక్కయ్యారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఆమె బంగారం దాచిన ప్లేస్ చూసి విస్తుపోయారు. బంగారాన్ని పౌడర్‌లా మార్చి అండర్‌వేర్‌లో దాచేసిందా మహిళ. ప్రైవేట్ ప్లేస్‌లో బంగారాన్ని దాచి పెట్టి అడ్డుగా శానిటరీ ప్యాడ్‌ను పెట్టి పీరియడ్స్‌లో ఉన్నట్లు నమ్మించే యత్నం చేసింది.


శానిటరీ ప్యాడ్‌ను తొలగించి చూసిన మహిళా అధికారులు అరకిలో బంగారం ఉంచిన ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆమె వెనుక ఉన్న అసలు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. గతంలోనూ బంగారం  చాలా సార్లు పట్టుబడినా.. ఇలా ఓ మహిళ ప్రైవేట్ పార్ట్స్‌లో బంగారాన్ని దాచి తీసుకురావటం మాత్రం గతంలో ఎప్పుడు జరగలేదంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఉన్న సాంకేతికత కారణంగా బంగారం ఎక్కడ దాచినా ఈజీగా పసిగట్టే వీలుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: