దేశ రాజధాని ఢిల్లీ లో నేడే అసెంబ్లీ పోలింగ్. ఇప్పటికే అసెంబ్లీ పోలింగ్ కోసం అధికారులు అన్ని సిద్ధం చేశారు. ఇన్ని రోజుల వరకు ఓటర్లను ఆకట్టుకునే దిశగా సర్వ  ప్రయత్నాలు చేసిన వివిధ పార్టీల అభ్యర్థుల భవితవ్యం నేడు తెల్చెయనున్నారు ఓటర్లు. మొత్తంగా ఢిల్లీలో 70 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు గానూ మొత్తం 60 వేల మంది సిబ్బంది నిర్వహించనున్నారు. కాగా ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో...3141 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా  గుర్తించిన అధికారులు పోలీసులు... ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు మధ్య  పోలింగ్ జరగనుంది. 

 


 ఇప్పటికే పోలింగ్  సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ కూడా అమలు చేసారు. పటిష్ట బందోబస్తు మధ్య ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 70అసెంబ్లీ స్థానాలకు గాను 672 మంది అభ్యర్థులు వివిధ పార్టీలు,  ఇండిపెండెంట్ అభ్యర్థిలుగా  పోటీ పడుతున్నారు. కాగా 70 వ్యాప్తంగా శాసనసభా స్థానాలకు గాను ఒక కోటి నలభై ఏడు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా నేడు ఎన్నికలు జరుగుతున్న 70 శాసనసభ స్థానాల్లో ... 58 జనరల్ 12 ఎస్సి  అభ్యర్థులకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి... ప్రత్యర్థులుగా  26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి ఆ పార్టీల మధ్య భారీ పోటీ నెలకొంది. 

 


 ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో మరోసారి కేజ్రీవాల్ ప్రభుత్వం రాబోతోందని పలు సర్వేలు తెలిపినప్పటికీ మిగతా పార్టీలు కూడా తమ పార్టీ గెలుస్తుందని ధీమా తో ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ సత్తా చాటుతున్న...  దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బిజెపి తన హవా నడిపించలేకపోతుంది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కేజ్రీవాల్ అయితే తాను ప్రవేశపెట్టిన పథకాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు  తమను గెలిపిస్తాయనే ధీమాతో  ఉన్నాడు  ముఖ్యమంత్రి కేజ్రీవాల్. కాగా నేడు ఢిల్లీ ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల ఫలితాలు ఈనెల 11న వెల్లడించనున్నారు. కాగా ఇప్పటికి పోలింగ్ ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: