ఆడ‌వారు సెక్స్ విష‌యంలో ర‌క ర‌కాలుగా ఉంటారు. కొంత మందికి అస‌లు సెక్స్ అనేదే న‌చ్చ‌దు. మ‌రికొంద‌రు ఎప్పుడైనా ఒక‌సారి ఇంట్ర‌స్ట్ చూపిస్తారు. ఇంకొంత‌మంది రోజూ చేసినా ప‌ర్వాలేదు అనుకుంటారు. కొంద‌రైతే ఎక్కువ‌గా అదేకావాల‌నుకుంటారు. భార్య, భర్తలు కలయిక లో పాల్గొనడం సర్వసాధారణం. అసలు దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే.. వారి శృంగార జీవతం బావుంటుంద‌ని న‌మ్మ‌కం. ఎంత చేసినా తృప్తి చెంద‌రు అలాంటి కోవ‌కు చెందిన ఓ మ‌హిళ‌ గురించి తెలుసుకుందాం. ఈ మ‌హిళ రెబెక్కా బర్కర్ అనే 37 ఏళ్ల మహిళకు శృంగారం అంటే చాలా పిచ్చి. ఈమెది టాడ్ కాస్టర్. ఈమె ముగ్గురు పిల్లల త‌ల్లి. అయినా కూడా సెక్స్ మీద పిచ్చి పోలేదు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి అవే ఆలోచ‌న‌లు. 

 

పెళ్ళికాక ముందు నుంచి కూడా అవే ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల పెళ్ళికి ముందే ఆ అనుభ‌వాన్ని తెలుసుకుంద‌ట‌. రోజులో 7గంటల పాటు సెక్స్ చేసినా కూడా ఆమెకు సంతృప్తి మాత్రం కలగలేదు అంటే మాత్రం ఎవరైనా ఏం చేస్తారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇదేంటి ఒక అమ్మాయిలో మ‌రీ ఇంత‌లాగా అలాంటి కోరిక‌లా అనుకుంటున్నారా.. ఇది నిజం త‌న భ‌ర్త ఒక రోజులో 7సార్లు సెక్స్ చేసినా ఆమెకు తృప్తి ఉండ‌టం లేదంట‌. అంతలా ఆమె సెక్స్ కి బానిసలా మారింది. ఇప్పటికి ఈమె రెండు పెళ్లిళ్ళు చేసుకుంది. మొద‌టి భ‌ర్త‌తో ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఈమె ప్ర‌వ‌ర్త‌న‌కు భ‌య‌ప‌డి మొద‌టి భ‌ర్త విడాకులు తీసుకున్నాడు. దీంతో ఈమె ఫ్రాన్స్‌లో ఉన్న మ‌రో వ్య‌క్తితో ప‌రిచ‌యం పెట్టుకుని అక్క‌డ మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. 

 

దీంతో త‌న రెండ‌వ భ‌ర్త ద‌గ్గ‌రే ముగ్గురు పిల్ల‌ల‌ను పెట్టుకుని ఉంటుంది. కానీ అక్క‌డ కూడా ఇదే ప్రాబ్ల‌మ్. ఆమె బాధను అర్థం చేసుకున్న రెండో భర్త ఆమెను మంచి సెకియాట్రిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. చివరగా తెలిసిందేమిటంటే ఆమె అలా ప్ర‌వ‌ర్తించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆమె హార్మోన్ల ప్రాబ్ల‌మ్ వ‌ల్లే ఆమె అలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని తెలిసింది. చివ‌రికి ఏం చేయాలో అర్ధం కాక దానికి మందులు వాడుతున్నారు. దీంతో ఈమె ప‌రిస్థితి ఇప్పుడు మునుపటి కంటే కాస్త న‌య‌మ‌యింది. జీవితంలో ఏదైనా స‌రే అతిగా ఉండ‌కూడ‌దు. ఏది అతిగా ఉన్నాఇబ్బందులు అనేవి త‌ప్ప‌వు. 

మరింత సమాచారం తెలుసుకోండి: