తెలంగాణలో గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ వారసుడైన కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని... అంతేకాకుండా కెసిఆర్ కూతురు కవిత కు మంత్రి పదవి కట్టబెట్ట పోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కెసిఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో భారీ మార్పులు జరిగే పరిణామాలు తొందర్లోనే రాబోతున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే కేటీఆర్ భారీగా ఐఎఎస్ల బదిలీలు చేయడం కూడా దీనికి సంకేతం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి ఇబ్బందులు పడకుండా విజయవంతంగా పరిపాలన చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కేసీఆర్. తండ్రి ఆదేశాలను కూడా తు.చ తప్పకుండా పాటిస్తూ తనదైన శైలిలో మార్పులు చేసుకుంటున్నారు కేటీఆర్. 

 


 ఈ నేపథ్యంలో అన్నీ కలిసొస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా కెసిఆర్ వారసుడు కేటీఆర్ అయ్యే  అవకాశం ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు  పైనే...  కాదు కూతురు కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై కూడా కెసిఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిజాంబాద్ నుంచి ఎంపీగా ఓటమిపాలై గత కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నా కవితను  మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకు వచ్చి కీలక పాత్ర పోషించేలా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే తన రాజకీయ వారసుడు కెటిఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. కూతురు కవిత కు మంత్రి పదవి ఇవ్వాలని కెసిఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో 2 ఎమ్మెల్సీ పదవులు కాళీగా ఉండగా..  మరికొన్ని రోజుల్లో మరో రెండు ఎమ్మెల్సీ పదవులు కూడా కాళి కానున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ నాలుగింటిలో ఒక ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి కవితను  మంత్రిని చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారట. 

 


 తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్  రాజకీయ వారసులు కేటీఆర్ కవితలను కీలకంగా మార్చి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కెసిఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. గతంలో పార్లమెంటు ఎన్నికల్లో కూడా కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు కేసీఆర్. దీనికి సంబంధించి కార్యాచరణ ఇప్పటికీ రూపొందుతున్న ట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పలువురు ఇది జరిగే పనేనా అని అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న పార్లమెంటు ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి బిజెపికి ఎదురు నిలబడి చక్రం తిప్పులకున్న కేసీఆర్ కు సొంత రాష్ట్రంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తాడా అనే అనుమానం కూడా కలుగుతోంది. అయితే కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కవిత కు మంత్రి పదవి అంటూ వస్తున్న వార్తలు మాత్రం కేవలం వార్తల వరకే మిగిలిపోతాయి అంటున్నారు మరికొందరు. మరి తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: