ప్రస్తుతం ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఆడది కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి మృగాళ్ల  మీద పడిపోయి అత్యాచారాలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా అతి దారుణంగా హత్యలు కూడా చేస్తున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు చేసేవారికి శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా మాత్రం మార్పు రావడంలేదు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి మనదేశంలో ఉరిశిక్షను అమలు అవుతున్నాయి. ఉరిశిక్ష అమలు అవుతున్నప్పటికీ కూడా పై స్థాయి  కోర్టులో పిటిషన్లు వేసినందున శిక్ష నుంచి తప్పించుకున్నారు నిందితులు. దీంతో అత్యాచారం చేసినప్పటికీ నిందితులకు సరైన శిక్ష పడడం లేదని అటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు కేవలం భారతదేశంలోనే కాదు మిగతా దేశాల్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 

 


 చిన్నారులపై అత్యాచారాలను పాల్పడి హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి అంటూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా దీనికి పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహ్మద్ ఖాన్ దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టగా... దీనికి పార్లమెంట్ మొత్తం ఆమోదముద్ర వేసింది. అయితే రోజురోజుకు చిన్నారులపై ఆకృత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.... ఇలాంటి ఘటనలు ఆగాలంటే నిందితులకు ఉరిశిక్ష వేస్తే సరిపోదు అని ఇలాంటి వారికి బహిరంగంగా అందరిముందే ఉరిశిక్ష వేయాలని అలాంటప్పుడు మరోసారి ఇలాంటివి  పునరావృతం కావు అంటూ ఆయన పేర్కొన్నారు. 

 


 రెండేళ్ల క్రితం పాకిస్థాన్ లోని నౌషేరా ప్రాంతంలో బాలికపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా... కామాంధుల బారిన పడి ఏ  చిన్నారి కూడా బలి కాకుండా ఉండేందుకు... నిందితులకు  బహిరంగంగా ఉరి శిక్ష విధించేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. దీనిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉరిశిక్ష విధించడం సరైనది కాదని ఇది ఐక్యరాజ్యసమితి నిబంధనలు ఉల్లంఘించడం అవుతుంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శిక్షలు తీవ్రత పెంచిన అంతమాత్రాన నేరాల సంఖ్య తగ్గదు అంటూ  పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత రాజా అష్రాఫ్  అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొంతమంది అత్యాచార నిందితులకు బహిరంగంగా ఉరిశిక్ష వేయడం పార్లమెంటు నిర్ణయం లా కాకుండా పార్టీ తీసుకున్న నిర్ణయంలా ఉంది అంటూ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: