తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతోంది. కేంద్రం హైదరాబాద్ - ముంబై మధ్య హై స్పీడ్ రైలును నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ - నాగపూర్ సెమీ హై స్పీడ్ రైలు ప్రపోజల్ దశలో ఉన్న విషయం తెలిసిందే. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్ - ముంబై మధ్య హై స్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుండటంతో ప్రయాణికులకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. 
 
20,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కొరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆరు రూట్లను సెమీ హై స్పీడ్, హై స్పీడ్ కారిడార్ల కోసం గుర్తించనుందని తెలుస్తోంది. హై స్పీడ్ రైల్వే కారిడార్ల కోసం ప్రభుత్వం గుర్తించిన రూట్లలో హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైలు కూడా ఉన్నట్టు రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ చెప్పారు. సంబంధిత అధికారులకు డిపీఆర్ సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. 
 
రద్దీ సామర్థ్యం, స్థల లభ్యత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని డీపీఆర్ ను సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు అందాయి. డీపీఆర్ సిద్ధమైన తరువాత రైల్వే బోర్డు రివ్యూ చేసి కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ ను పంపుతుంది. కేంద్రం నుండి ఆమోదం లభిస్తే పనులు ప్రారంభమై రాబోయే ఐదు సంవత్సరాలలో హై స్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. 
 
సాధారణంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ నుండి ముంబైకు వెళ్లాలంటే 12 గంటల సమయం పడుతుంది. హై స్పీడ్ రైళ్లలో ప్రయాణ సమయం 4 నుండి 5 గంటలకు తగ్గనుంది. హై స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ రైళ్లు ఉండటంతో ప్రయాణికులకు కూడా ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: