సోష‌ల్ మీడియా అనేది వ్య‌క్తుల మ‌ధ్య బందాల‌ను క‌లిపేది. ఇద్ద‌రి వ్య‌క్త‌లు మధ్య ప‌రిచ‌యాల‌న్ని క‌లిపేది. ఆడ‌, మ‌గ స్నేహం చేయ‌డానికి ఒక ప్లాట్ ఫాంగా మారింది. మ‌గ‌, మ‌గ స్నేహం, పేద, ధ‌నిక క‌లిసి ప్ర‌యాణం చేయ‌డానికి ఒక ప్లాట్‌ఫాం. ఒక‌ళ్ళ గురించి ఒక‌ళ్ళు తెలుసుకునే ప్లాట్‌ఫాం. మ‌న‌కు తెలియ‌ని వ్య‌క్తుల గురించి ఏమి స‌క్ర‌మంగా ఉన్నాయి ఏమిలేవు అన్న‌వి తెలుసుకోవ‌డం. వాళ్ళ మంచి, చెడుల గురించి తెలుసుకోవ‌డం.  అయితే ఈ షాకింగ్ స‌ర్వేలో తెల‌సిన నిజాలు ఏమిటంటే చివ‌రికి ముందు సంఘ‌టిత‌త్వం చేసిన‌టువంటి సోష‌ల్ మీడియా విచ్చ‌న్నం చేస్తోంది. ఇది చాలా ప్ర‌మాద‌క‌మైన‌టువంటి అంశం. ముందు ఎదుటివారితో ప‌రిచం చేసుకోవ‌డం అంటే ఫేస్‌బుక్ ఇంకా ఈ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫారాల‌న్నీ కూడా ముందు ఒక‌ళ్ళ‌ని ఒక‌ళ్ళు తెలుసుకోవ‌డానికి ప‌నికివ‌చ్చేవి. ఆ త‌రువాత కాలంలో కొన్ని పెడ‌పోక‌డ‌లు వ‌చ్చాయి. అందులో మ‌హిళ‌ల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించే తీరుగాని... ఆర్ధిక‌ప‌రంగా మిస్ యూజ్ చేయ‌డంగాని ఇలాంటి కొంత కొంత మంది వ్య‌క్తుల చ‌ప‌ల‌త్వం అని చెప్ప‌వ‌చ్చు.  కానీ దీంతో ఏకంగా స‌మూహాలు త‌యార‌వుతున్నాయి. 

 

ఇది నా కులం, నా వ‌ర్గం, నాపార్టీ నా ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఒక బృందం. ఈ బృందాల త‌త్వం ఎప్పుడైతే వ‌స్తుందో అది పెద్ద అండ‌రెస్ట‌డ్‌కి కార‌ణం అవుతుంది. అంటే ఇక్క‌డ ప్ర‌తి ఒక వ్య‌క్తిలోనూ అన్ని ర‌కాలైన‌టువంటివి ఉంటాయి. ఒక‌రాజ‌కీయ పార్టీకి ఓటువేయ‌డంతో వారి బానిస‌ల‌ని అర్ధం కాదు. ఇప్పుడు వీరి ప‌రిపాల‌న బాగా చేస్తే అవ‌త‌లి వారికంటే బెట‌ర్ అని మ‌నం న‌మ్ముతాం. అంతేగాని అవ‌త‌లివారు నాశ‌నం అవ్వాల‌ని ఏ ఓట‌రు కోరుకోరు. అలాగే ఒక గుడికి వెళుతున్నామంటే.. రామ‌ల‌యానికి వెళుతున్నామంటే శివాలయం వ‌ద్ద‌నికాదు వేరేదేవుడు వ‌ద్ద‌ని కాదు. అంతే త‌ప్పించి ఇక్క‌డ ఈ వ‌ర్గం ఈ త‌త్వం అనేది కాదు. భార‌తీయ స‌మాజంలో ఒక‌ళ్ళ‌ని ద్వేషించ‌డం అనేది కాదు. ఈ ద్వేషాలు ఈ మ‌ధ్య పుట్టుకురావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఒక‌టి ఉంది. అదేమిటంటే...సోష‌ల్ మీడియాల ప్లాట్‌ఫాం అనేది ప్ర‌ధానంగా వ‌స్తున్నటువంటి స‌ర్వే లెక్క‌ల్లో తేలున‌టువంటి అంశం. స‌మూహాలుగా మారిపోవ‌డం ఒక ఎత్తైతే. మాదంతా ఒక గ్రూప్ అని ఫీల‌వుతుంటే. 

 

ప‌క్క గ్రూప్‌ని శ‌త్రువుగా ఫీల‌వడం అనేది మ‌రొక అంశం. ఈ మ‌ధ్య కాలంలో పుడుతున్న‌టువంటి జాఢ్యం. దాని వ‌ల్ల ఒక అండ‌రెస్ట్ క్రియేట్ అయిపోద్ది. దీనివ‌ల్ల మ‌నం గ‌తంలో ఎవ‌రికి ఓటు వేశాం ఎవ‌రితో తిరిగాం ఏ పార్టీతో ఉన్నాం ఇవ‌న్నీ అన‌వ‌స‌రం ఒక‌ప్పుడు అంద‌రం క‌లిసేవాళ్ళం తిరిగే వాళ్ళం తినేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో త‌మ ఎక్స్‌ప్రెష‌న్‌ని భావ ప్ర‌క‌ట‌న‌ల‌ను వ్య‌క్తం చేయ‌డం వ‌ల్ల ఇలాంటి ఇబ్బందుల‌న్నీ వ‌స్తున్నాయి. వీటి వ‌ల్ల వాటిని ద్వేషిస్తూ చాలా మంది సొంత వారై దూర‌మైపెతున్నారు. సోష‌ల్ మీడియా అనేది కేవ‌లం వ‌ర్గాల‌ను క‌లుపు వ్య‌క్తుల మ‌ధ్య బంధాల‌ను క‌ల‌పాలే గాని ఈ ర‌కంగా ఉండ‌కూడ‌దు. దీని వ‌ల్ల మాన‌సికంగా, శారీర‌కంగా అన్ని విధాల భవిష్య‌త్తు ఇబ్బందులు వ‌స్తాయి. ఈ విష‌యాన్ని దృస్టిలో పెట్టుకోవ‌ల‌సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రికి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: