ఢిల్లీలో నేడు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాగా ఇన్ని రోజుల వరకు హస్తిన ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసిన వివిధ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు భవితవ్యం ఏమిటో  నేడు ఓటర్లు తేల్చేయనున్నారు. కాగా మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలకు నేడు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ముఖ్యంగా ఆప్ బిజెపి కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు 60 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. 

 


 కాగా ఢిల్లీలో ఓటర్లు కూడా ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హస్తిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కాగా  నడవలేని పరిస్థితిలో ఉన్నవారు వృద్దులు వికలాంగులు  ఓటు వేసేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు ఢిల్లీ ఎన్నికల అధికారులు. 80 ఏళ్లు పైబడిన వృద్దులు దివ్యాంగ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వేళ్ళకుండానే ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు అధికారులు. వీరంతా పేపర్ బాలెట్ సాయంతో ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీనికోసం ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 

 

 

 అంతేకాకుండా ఓటర్లు  ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఒక ప్రత్యేకమైన యాప్  కూడా రూపొందించింది. దీని ద్వారా ఓటరు ఏ పోలింగ్ కేంద్రాల వద్ద... ఈ మేరకు క్యూ ఉందో తెలుసుకోవచ్చు. తద్వారా క్యూ లేని సమయంలో వెంటనే వెళ్లి ఓటు వేసి వచ్చే సౌలభ్యాన్ని ఈ యాప్ ద్వారా తెలియజేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. కాగా  ఎంతో పటిష్ట బందోబస్తు మధ్య ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు ఆయా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎన్నికలను కాంగ్రెస్ బిజెపి ఆప్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా  ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 11న విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: