భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్‌ పదవీకాలం గత డిసెంబర్‌లో పూర్తయ్యింది. దీంతో కొత్త అధ్యక్షుడు ఎవరన్న చర్చ జరుగుతోంది. డిసెంబర్ తరువాత ఎన్నికల హడావిడి ఏది లేకపోవటంతో అధిష్టానం కూడా అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే త్వరలో గ్రేటర్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటంతో త్వరలోనే అధ్యక్షడి ఎంపిక జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది.

 

కేంద్రంలోనే జేపీ నడ్డా అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవటంతో ప్రాంతీయ విభాగాల్లోనే అధ్యక్షుల ఎంపిక త్వరలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌ బసీ సామాజాకి వర్గానికి చెందిన వాడు కావటంతో కొత్త అధ్యక్షుణ్ని మరో సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట.

 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి సరైన ప్రత్యామ్నయం లేకపోవటంతో ఆ లోటు భర్తి చేసేందుకు బీజేపీ శ్రమిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావటంతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి వారికి మరింత బలం చేకూర్చేలా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త సారథులుగా మాజీ మంత్రి డీకే అరుణ, లేదా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలో ఒక్కరికి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వీరిద్దరు ఈ మధ్యే బీజేపీ పార్టీలో చేరిన వారు కావటంతో చాలా కాలంగా పార్టీలో ఉన్నవారు ఎలా రియాక్ట్ అవుతారన్న ఆలోచన కూడా చేస్తున్నారు.

 

మరో నెలరోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని భావిస్తున్నారు. కొంత మంది మరో వాదనను కూడా తెర మీదకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడి మార్పు అంత అవసరం లేదని, అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉందని అందుకే లక్ష్మణ్‌నే మరికొంత కాలం అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: