విజయవాడలోని కంచుకోట అపార్టమెంట్లలోని రహస్య లాకర్లు ఓపెన్ అయ్యాయి. ఇక కంచుకోట బద్దలవ్వటమే మిగిలింది. ఇది..చంద్రబాబునాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ వ్యవహారంలో ములుపు తిరిగిన కీలక పరిణామం.  శ్రీనివాస్ ఇంటిపై గడచిన మూడు రోజులుగా ఐటి అధికారుల సోదాలు జరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.  మాజీ పిఎస్ జీఏడిలో స్టాటిస్టికల్ అధికారి మాత్రమే. కానీ మూడు రోజులుగా ఐటి అధికారుల సోదాలు ఇంకా ఎందుకు ఓ కొలిక్కిరాలేదు ?

 

ఎందుకు రాలేదంటే శ్రీనివాస్ మామూలు జీఏడి అధికారి మాత్రమే కాదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నంత కాలం శ్రీనివాస్ కళ్ళు, చెవుల్లాగ పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. టిడిపి అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు తరపున అపరిమితమైన అధికారాలు చెలాయించిన విషయం అందరూ చూసిందే. దేశంలోని బడా కాంట్రాక్టర్లు, నిర్మాణ కంపెనీలతో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపిందంతా శ్రీనివాసే.

 

కాబట్టే కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకనే ఐటి రెయిడ్స్ జరిగాయి. మూడు రోజులుగా జరుగుతున్న సోదాల్లో  తాజాగా ఓ రహస్య లాకర్ బయటపడినట్లు సమాచారం.  ఎప్పుడైతే లాకర్ విషయం వెలుగు చూసిందో అందరిలోను టెన్షన్ పెరగిపోతోంది. లాకర్లో కొన్ని డైరీలున్నాయని అందులో ఆర్ధిక లావాదేవీల వివరాలున్నట్లు సమాచారం.

  

చంద్రబాబు హయాంలో పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్ధలు  వేల కోట్ల రూపాయల పనులు చేశాయి.  అన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు చేసినా అన్నీ నాసిరకమే అన్న విషయం బయటపడింది. అంటే ఏ స్ధాయిలో ముడుపులు చేతులు మారితే నాసిరకం పనులకు కూడా బిల్లులు ఇచ్చేస్తారు ? దానికితోడు దక్షిణాది రాష్ట్రాల్లోని ఓ ముఖ్యనేతకు రూ. 150 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు ముంబాయ్ లోని కాంట్రాక్టు సంస్ధ డైరీలో బయటపడింది.

 

సో సంస్ధ డైరీలో ముడుపుల వివరాలు బయడపడటం, ఇపుడు శ్రీనివాస్ ఇంట్లో ఓపెన్ చేసిన లాకర్లో కూడా ఆర్ధిక లావాదేవీల వివరాలున్నాయనే సమాచారం బయటపడటంతో ఏ నిముషంలో ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందో అనే టెన్షన్ పెరిగిపోతంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: