అవును ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు (ఏఐఐబి) తీసుకున్న నిర్ణయం ఆర్ధిక సమస్యల్లో ఉన్న   జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆక్సిజన్ అందించినట్లే ఉంది.  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేక జగన్ ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. ఇటువంటి సమయంలో  ఒక్కసారిగా ఏఐఐబి రూ. 21 వేల కోట్ల అప్పు ఇవ్వటానికి ముందుకురావటమంటే మామూలు విషయం కాదు. పైగా తామిచ్చే అప్పును ఏ బ్యాంకు అయినా, ఆర్ధిక సంస్ధ అయినా పలానా పనులకు మాత్రమే ఉపయోగించాలనే షరతులు పెట్టటం మామూలే.

 

కానీ ఏఐఐబి మాత్రం రాష్ట్రప్రభుత్వం ప్రయారిటి ప్రకారం దేనికైనా ఖర్చు చేసుకోవచ్చని చెప్పటంతో జగన్ ఫుల్లు హ్యాపీ అయిపోయారు. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చేనాటికి ఏపికి అప్పులు ఇవ్వటానికి ఏ బ్యాంకు కానీ ఆర్ధిక సంస్ధకానీ ఇష్టపడలేదు. అదే విషయాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పష్టంగా ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

నవరత్నాల రూపంలో పథకాల అమలుకు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితరాల అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ అప్పులు ఇస్తామంటే అక్కడకు పరిగెత్తుతున్నారు.  ఇటువంటి సమయంలోనే ఏఐఐబి ముందుకొచ్చింది. కార్యక్రమాల అమలులో భాగంగా ప్రభుత్వంలో జరుగుతున్న దుబారాను తగ్గిస్తు, అనవసర వ్యయాన్ని ఎంత తగ్గించినా ఉపయోగం కనబడటం లేదు.  

 

ఈ నేపధ్యంలో ఏఐఐబి ఉన్నతాధికారులు జగన్ ను కలిసి అప్పు విషయంలో తీపి కబురు చెప్పటాన్ని చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ ఉద్దేశ్యంలో ఎక్కడ కూడా అప్పు పుట్టక జగన్ ఇబ్బందులు పడాలని. అంటే జగన్ మీద అక్కసుతో రాష్ట్రం ఇబ్బందులు పడినా వాళ్ళకు సంతోషంగానే ఉంటుందని తేలిపోయింది.  విచిత్రమేమిటంటే చంద్రబాబు హయాంలో ఇదే బ్యాంకు ఇస్తానన్నది కేవలం రూ. 1360 కోట్లు మాత్రమే.

 

మరి ప్రభుత్వం మారి జగన్ అధికారంలోకి రాగానే  అప్పును రూ. 21 వేల కోట్లకు ఎందుకు పెంచిందో ఆశ్చర్యంగా ఉంది. ఈ మొత్తంతో అమ్మఒడి, పాఠశాలలు నాడు-నేడు, స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియా ప్రవేశపెట్టేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు తదితరాలకు ఉపయోగించబోతున్నట్లు సమాచారం. అంటే ఓ రకంగా జగన్ కు ఆర్ధిక కరువు చాలా వరకూ తీరినట్లే అనుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: