మందులో తడిసి ముద్దౌతోంది నేటి యువతరం. అవును. వారంతా పాతికేళ్లలోపు యువతీ యువకులు. ఉద్యోగాలే వెలగబెడుతున్నారో.. ఉన్నత విద్యలే అభ్యసిస్తున్నారో ఎవరికి తెలియదు గాని, ఆడామగా తేడా లేకుండా మద్యం మత్తులో ఊగిపోతున్నారు.. పరిసరాలను మరిచిపోయి చిందులు వేస్తున్నారు.. మాదకద్రవ్యాల మైకంలో మరో లోకంలో పయనిస్తున్నారు.. పోలీసులు రంగప్రవేశం చేసి 270 మంది యువతీ, యువకులను అరెస్ట్‌ చేశారు. 

 

ఇంతకీ ఇదెక్కడి తంతంటే.. దిండుగల్లు జిల్లా "కొడైక్కెనాల్‌, ఇళవరసి" అనే కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచేగాక విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇదిలాఉండగా కొడైక్కెనాల్‌ కోండ పై భాగంలో యువతీయవకులు అడపాదడపా మాదకద్రవ్యాలు, మద్యం పార్టీలు చేసుకుంటారు. కొన్ని నెలల క్రితం న్యాయస్థానం అనుమతితో పోలీసుల పర్యవేక్షణలో పూంపారై కొండపై కొందరు మద్యం పార్టీ చేసుకున్నారు. 

 

ఇదిలా ఉండగా, గురువారం రాత్రి కొడైక్కెనాల్‌ పైభాగం కొండకు సమీపంలోని గుండుపట్టి గ్రామంలోని ఒక ప్రయివేటు తోటలో.. పెద్ద సంఖ్యలో యువత కోలాహలం సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పళని తైపూస మహోత్సవంలో భద్రతా విధుల కోసం దిండుగల్లు జిల్లాకు వెళ్లి ఉండిన శివగంగై జిల్లా మానామధురై డీఎస్పీ "కార్తికేయన్‌".. నేతృత్వంలో పోలీసుల బృందం గుండుపట్టి గ్రామానికి చేరుకొని కొరడా ఝళిపించింది. 

 

ప్రయివేటు తోటలో యువతీయువకులు మద్యం, మాదకద్రవ్యాల మత్తులో ఊగిపోవడాన్ని చూసి అవాక్కయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 270 మందిలో ఆరుగురు యువతులు కూడా ఉన్నారు. బ్రెజిల్‌ దేశానికి చెందిన ఒక యువకుడిని కూడా పోలీసులు గుర్తించారు. తోటలో పార్టీ చేసుకుంటున్నవారంతా 25 ఏళ్లలోపు యువతీయువకులే కావడం అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఈ సందర్భంగా .. ఒక కవి రాసిన లైన్ గుర్తుకు రక మానదు... "కాలిపోతోంది నవతరం... భోగి మంటలో కట్టేలా.. చితికిపోతోంది యవ్వనం అడవిలో కాసిన కాంతిలా...! 

మరింత సమాచారం తెలుసుకోండి: