ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది సెక్స్ కి  ఇచ్చిన  ప్రాధాన్య‌త  దేనికీ ఇవ్వ‌డం లేదు. కామాతురాణం.. నాసిగ్గు.. నాల‌జ్జ‌.. అన్న‌ట్టుగా త‌న మ‌న తేడాలేకుండా విచ్చ‌ల‌విడిగా కామ‌వాంఛ‌ని తీర్చుకోవ‌డానికి ఎంత‌కైనా తెగిస్తున్నారు. అదే లోకం అదే స‌ర్వ‌స్వంగా బ‌తుకుతున్నారు. అదే యాస‌, అదే ధ్యాస‌లో ఉంటున్నారు. నేటి యువ‌త నుంచి ముస‌లివాళ్ళ వ‌ర‌కు ఇదే ప్ర‌ధాన ధ్యేయంగా ఉంటున్నారు.  దీనికి ప్ర‌త్యేకించి వ‌య‌సు, బంధాలు, బంధుత్వాలు, కుల‌, మ‌త విలువ‌లు ఆచారాలు, సాంప్ర‌దాయాలు ఏమీ లేకుండా చెప్పాలంటే ఇదొక మ‌హ‌మ్మారిలా త‌యార‌యింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ప‌ల్లెల నుంచి మ‌హాన‌గ‌రాల వ‌ర‌కు ఈ విష సంస్కృతి పాకింది. దీని వ‌ల్ల క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటీవ‌ల కాలంలో ప్ర‌తిరోజు దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఇలాంటి సంఘ‌ట‌న‌లు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. ఇందులో ప్ర‌త్యేకంగా చెప్పుకునేదేమిటంటే ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు కేవ‌లం చ‌దుకోని వాళ్ళే కాదు. చ‌దువుకున్న‌వారు కూడా దీనికి అతీతులు కాదు. 

 

ఇటీవ‌లె జ‌రిగిన బెంగుళూరు క‌థ‌నం తీసుకుంటే...ఒక యువ‌తి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంది. ఆమె ఏకంగా త‌న క‌న్న‌త‌ల్లితే క‌త్తితోపొడిచి క‌డ‌తేర్చ‌డ‌మేకాక అడ్డొచ్చిన త‌మ్ముడిని కూడా హ‌త‌మార్చ‌డానికి ప్ర‌య‌త్నించింది. త‌ర్వాత త‌న ప్రియుడితో క‌లిసి వేరే అండ‌మాన్ పారేపోయింది. ఇక స్వామిజీ ముసుగులో చాలా మంది చేసే వెధ‌వ ప‌నుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ ప‌క్క దైవం అంటూనే మ‌రోప‌క్క చేసేవ‌న్నీ అలాంటి ప‌నులే గ‌తంలో ఇలాంటివి ఎన్నో వెలుగు చూసిన‌వి చాలానే ఉన్నాయి.  నిత్యానంద స్వామి, ఆశారామ్ స్వామిజీ నుంచి మొద‌లుకొని చిన్న చిత‌క స్వాములు కూడా వారి ఆశ్ర‌మానికి వ‌స్తున్న మ‌హిళ‌ల‌తో త‌మ కామ‌వాంచ‌లు తీర్చుకుంటున్నారు.  ఇక యువ‌తి, యువ‌కులైతే ఇదే ప్ర‌పంచ‌మ‌ని విహ‌రిస్తున్నారు. వివాహితుల‌తో అక్ర‌మ సంబంధాలు లెక్క లేకుండా పోయాయి. అగ్నిసాక్షిగా తాళీ క‌ట్టిన భ‌ర్త‌ల‌ను కూడా క‌డ‌తెరుస్తున్నారు. త‌మ కామ వాంచాల‌కు అడ్డు వ‌చ్చిన వారిని క‌డ‌తెర్చేందుకు వెన‌కాడ‌డం లేదు. ఈ సంఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా కోకోల్లాలు. 

 

భార‌త స‌మాజం విలువ‌లు, సంప్ర‌దాయాలు, కట్టుబాట్ల‌తో వేలాది సంవ‌త్స‌రాలు న‌డుస్తున్న‌ది. కానీ ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తే ఆందోళ‌న‌లు క‌ల్గిస్తున్నాయి. దేశ సంస్కృతి విచ్చిన్న‌మ‌య్యే ప‌రిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో సెక్స్‌పై ప్ర‌భుత్వాలు అయా రంగాల్లో ప‌నిచేస్తున్న ఉద‌్యోగులు, విద్యార్థులకు ప్ర‌త్యేక అవ‌గాహ‌న పెంచాల్సిన అవ‌స‌ర‌ముంది. అంతేకాకుండా కుటుంబ నేప‌థ్యం, సంప్ర‌దాయాలు ప‌ద్ద‌తుల‌పై కూడా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌ర‌ముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: