వరుస ఐటీ దాడులతో తెలుగుదేశం పార్టీ బెంబేలెత్తిపోతోంది. ముఖ్యంగా టిడిపి నాయకులతో పాటు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా కొంతమంది అధినాయకుడు, ఆయన వారసుడి పేరు చెప్పి రాష్ట్రంలో పెత్తనం చేయడం, బడా కాంట్రాక్టర్లు, సంస్థలు నుంచి భారీగా సొమ్ము వసూలు చేయడం తదితర విషయాలు అన్నింటిపైనా ఇప్పుడు ఐటీ శాఖ కన్నువేసి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడంతో టీడీపీ నాయకుల్లో ఎక్కడలేని బయన్దోళనలు పెరిగిపోతున్నాయి. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి పెద్దగా సంబంధం లేకుండానే నేరుగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఐటీ అధికారులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాలు చేస్తున్నట్లుగా తేలడం టీడీపీకి మరింత కంగారు పుట్టిస్తోంది.


ఈ వ్యవహారాలతో టిడిపి నాయకులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు పదేళ్ల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్, అలాగే లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా, కుటుంబ వ్యాపార సంస్థ నిర్వహణ హోల్డింగ్స్ డైరెక్టర్ గా ఉన్న రాజేష్, వైఎస్ఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కి సంబంధించిన ఆర్కె ఇన్ఫ్రా, పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కు చెందిన అవెక్సా ఇన్‌ఫ్రా మొదలైన చోట్ల దాడులు నిర్వహించారు. ముఖ్యంగా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ కిలారు రాజేష్ వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఐటి అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 


రెండు రోజులుగా ఆయన నివాసం వ్యాపార సంస్థలను ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు గతం లో అమరావతి లో కాంట్రాక్టు కంపెనీలో ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 కోట్లు అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు తెలుస్తోంది. వాటిలో టిడిపికి చెందిన అగ్ర నాయకులకు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో వాటి ఆధారంగా ఇప్పుడు ఐటీ అధికారులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు.


 టీడీపీ అధికారంలో ఉండగా కిలారి రాజేష్ పై  చాలానే ఆరోపణలు వచ్చాయి. అయినా వాటిని పట్టించుకోకుండా అతడిని లోకేష్, చంద్రబాబు ప్రోత్సహించడంతో ఆయన అన్ని వ్యవహారాల్లోనూ వేలు పెట్టి వివాదాస్పదం అయ్యాడు. ఇప్పుడు ఇతగాడి వ్యవహారం బట్టబయలు అవ్వడంతో టీడీపీ పెద్ద తలకాయలకు తలనొప్పిగా మారిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: