ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ప్రతిరోజు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా రెండు వేరు వేరు పార్టీలే అయినప్పటికీ ప్రజల కోసం రెండు పార్టీలు కలిసి పని చేయక తప్పదు. 
 
రాష్ట్రంలో కొన్ని చోట్ల టీడీపీ, వైసీపీ నేతలు ప్రజలను దృష్టిలో ఉంచుకొని కలిసి పని చేస్తుండటంపై హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా మైలవరం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ ఎంపీ కేశినేని నానిని ప్రశంసలతో ముంచెత్తారు. మైలవరం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులను చేపట్టాలనే ఉద్దేశంతో వసంత కృష్ణప్రసాద్ కేశినేని నానిని కలిశారు. 
 
మైలవరంలోని అభివృద్ధి పనుల కోసం సహాయం చేయాలని కోరగా కేశినేని నాని వెంటనే 50 లక్షల రూపాయల ఎంపీ నిధులను వసంత కృష్ణప్రసాద్ కు ఇచ్చారు. కేశినేని నాని 50 లక్షల రూపాయల నిధులు ఇవ్వడంతో మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. ఎంపీ కేశినేని నాని మైలవరం నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం గమనార్హం. 
 
రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ తమకు ప్రజల సంక్షేమమే ముఖ్యమని ప్రజల కోసం కలిసి పని చేస్తామని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ నేతలు కలిసి పని చేస్తూ ఉండటం పట్ల మైలవరం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎన్ని విబేధాలు ఉన్నా ప్రజల కోసం ఇరు పార్టీల నేతలు కలిసి పనిచేయడం శుభపరిణామమని అన్నారు. ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
               

మరింత సమాచారం తెలుసుకోండి: