ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది ఏదైనా ఉంది అంటే అదో కరోనా వైరస్ అనే చెప్పాలి. అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం మనుషులతో ఆడుకుంటుంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అలాంటి ఈ వైరస్ కారణంగా చైనాలో కొందరు పండుగ చేసుకుంటున్నారట.. వారెవరో ఇప్పుడు చదివి తెలుసుకుందం. 

 

వారెవరో కాదు.. జంతువులు, పక్షులు. అవి ఎందుకు ఆనందంగా ఉన్నాయి అని అనుకుంటున్నారా? అదేనండి.. కరోనా వైరస్ రావడానికి కారణం జంతువులు, పక్షులే కారణం అని సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. అందుకే ఆ చైనీయులు నాన్ వెజ్ తినడం మానేశారట.

 

దీంతో చైనాలోని జంతువులు, పక్షులు అన్ని ఊపిరి పీల్చుకుంటున్నాయట. మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.. అన్ని ఎందుకు ఊపిరి పీల్చుకుంటాయి అని. కానీ అదే నిజం. జంతువులు, పక్షులు అన్ని కూడా.. వాళ్ళు ఏం ఏం తింటారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. వాళ్ళు తినేవి ఏంటో చదివి వాంతులు చేసుకుంటే మాకు సంబంధం లేదు ముందే చెప్తున్నా. 

 

చైనీయులు.. బొద్దింకతో మొదలు పెట్టి.. పాములు, యాండ్రకాయలు, కప్పలు, కుక్కలు, నక్కలు, పిల్లలు, జింకలు, పందులు, కొండా ముచ్చులు, కోడి, ఆవు, దున్నపోతు, ఏనుగుడ్డు, గబ్బిలాలు, సింహాలు, పులులు, కాకులు, గద్దలు ఇలా ఒకటి కాదు ఆబ్బె చెప్తుంటేనే కడుపు తిప్పుతుంది.. కానీ వాళ్ళు అవన్నీ తింటారు. 

 

అందుకే అన్నారు.. ఈ కరోనా వైరస్ కారణంగా జంతువులు, పక్షులు తెగ ఆనందంగా ఉన్నాయి అని.. అన్ని రకాల జంతువులను, కీటకాలను, పక్షులను తింటే రోగాలు రాక ఆరోగ్యంగా ఉంటారా? అందుకే సోషల్ మీడియాలో ప్రచారం చూసి.. డాక్టర్లు తినచ్చు అని చెప్పిన సరే చైనీయులు నాన్ వెజ్ ముట్టడం లేదట.. ఏది ఏమైనా ఈ కరోనా వైరస్ కారణంగా జంతువులు, పక్షులు సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: