మొన్నటి వరకు అనంతపురం జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించి తాము చేసే అక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటూ వచ్చిన జేసీ బ్రదర్స్ కు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జేసీ ట్రావెల్స్ పై లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు వస్తూనే ఉండడంతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగి జేసీ ట్రావెల్స్ పై పూర్తిస్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టగా అనేక అక్రమాలు దీంట్లో బయటపడ్డాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి మరి బస్సులను అక్రమంగా కొనుగోలు చేసి తిప్పుతూ ఉండడంపై రవాణా శాఖ అధికారులు అన్ని ఆధారాలతో జేసీ బ్రదర్స్ అక్రమాలను గుర్తించారు.


 పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు 2017 మార్చి 29 వ తేదీన కొత్తగా అమలులోకి తీసుకు వచ్చిన నిబంధనల ప్రకారం బీఎస్ 3 వాహనాలను నిషేధిస్తూ బీఎస్ 4  వాహనాలను మాత్రమే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విక్రయించాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిబంధనలు ఏవి పట్టించుకోకుండా జేసి బ్రదర్స్ కర్ణాటక, ఉత్తరాఖండ్ లో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి వాహనాలను కొన్నట్లు చూపుతూ వాటిని నాగాలాండ్ లో బీఎస్ 4 వాహనాలుగా 2018 ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి రిజిస్టర్ చేయించిన 68 వాహనాలు తాడిపత్రి కేంద్రంగా తిరుగుతుండడాన్ని రవాణా శాఖ గుర్తించింది. 


అయితే ఈ బస్సుల రిజిస్ట్రేషన్ సమయంలో తాత్కాలిక అడ్రస్ గా నాగాలాండ్ లోని కోహిమా అడ్రస్ ఇచ్చి శాశ్వత చిరునామా తాడిపత్రి అడ్రస్ ఇచ్చారు. ఇలా కొనుగోలు చేసిన కొన్ని వాహనాలు తాడిపత్రిలోని గోపాలకృష్ణారెడ్డి పేరుతో, మరికొన్ని వాహనాలు జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ పేరుతో రిజిస్టర్ చేయించారు. నాగాలాండ్ నుంచి కొనుగోలు చేసిన రెండు వారాల్లోనే తాడిపత్రికి తీసుకువచ్చారు. సదరు వాహనాలపై ఫిర్యాదులు రావడంతో ఏపీ రవాణాశాఖ అధికారులు అశోక్ లేలాండ్ కంపెనీ కి 2018 జనవరి 10వ తేదీన లేఖ రాయడంతో జేసి ట్రావెల్స్ అక్రమాలు బయట పడ్డాయి.


 అశోక్ లేలాండ్ కంపెనీ 2017 మార్చి నెలాఖరు తర్వాత మిగిలిన బి ఎస్ 3 వాహనాలను స్క్రాప్ కింద అమ్మేయగా వాటిని చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతుండడంపై రవాణా శాఖ కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో వారికి సుమారు 100 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో జేసీ బ్రదర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా జెసి బ్రదర్స్ అక్రమాలు బయట పడుతుండడంతో ముందు ముందు మరికొన్ని ఈ తరహా వ్యవహారాలు బయటపడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుండడంతో జేసీ బ్రదర్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: