ఐటీ అధికారులు వరుస దాడులతో తెలుగుదేశం పార్టీ నేతలకు వణుకు పుట్టిస్తున్నారు. ఐటీ సోదాలలో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఐటీ అధికారులు టీడీపీ నేతలతో పాటు టీడీపీ నేతల సన్నిహితుల ఇళ్లలో కూడా 
సోదాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ తనిఖీలు మూడో రోజు కూడా జరుగుతున్నాయి. 
 
విజయవాడ గాయత్రీనగర్ లోని కంచుకోట ప్లాజాలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికే ఐటీ అధికారులు శ్రీనివాస్ రహస్య లాకర్ లో దాచిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ శ్రీనివాస్ ను విచారించి అతని సన్నిహితుల వివరాలను మరియు అతని బంధువుల వివరాలను కూడా సేకరిస్తోంది. చంద్రబాబుకు చెందిన బినామీ సంస్థలలో జరిగిన నకిలీ లావాదేవీలను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. 
 
ఐటీ శాఖ అధికారులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన అలెక్సా కంపెనీలో ఐటీ దాడులు జరిపారు. లోకేశ్ సన్నిహితుడు అయిన కిలారి రాజేష్ సంస్థలపై కూడా ఐటీ శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. ఐటీ అధికారులు హైదరాబాద్ బంజారహిల్స్ లోని కిలారి రాజేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ఐటీ, జీఎస్టీ పన్నులు చెల్లించనట్టు ఐటీ అధికారులకు ఆధారాలు లభించాయని సమాచారం. 
 
ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందాలు గత మూడు రోజులుగా టీడీపీ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నాయి. ముంబాయికి చెందిన ఒక బడా కంపెనీ తెలుగుదేశం పార్టీ నేతలకు 150 కోట్ల రూపాయల చెల్లించినట్లుగా ఆధారాలు లభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రాజెక్టులు ఇచ్చేందుకు కొందరు కీలక నేతలకు పెద్దమొత్తంలో ముడుపులు అందాయని కూడా తెలుస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఒక భారీ స్కామ్ కూడా వెలుగులోకి రానుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: