ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నగారా మోగింది అప్పటినుంచి ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి  అన్ని పార్టీలు. ఓటర్లను ఆకర్షించడమే  లక్ష్యంగా ఎన్నో హామీలను కూడా కురిపించారు. ఇక ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఇన్ని రోజుల వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసిన అభ్యర్థుల భవితవ్యం ఏమిటో ఓటర్లు నేడు తేల్చేయనున్నారు

 

 దీంతో ఢిల్లీ ఎన్నికల పోలింగ్ పై  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మాత్రం ఉదయం నుంచి మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ 29.14 శాతం మాత్రమే నమోదయింది. ఎన్నికల కమిషన్ ఓటర్ టర్నవుట్  ప్రకారం ఈశాన్య ఢిల్లీలో ఇప్పటివరకు 34.82%... ఈస్ట్ ఢిల్లీ లో 31.31%... వాయువ్య ఢిల్లీలో 28.78%... ఢిల్లీలో 26.77%... సౌత్ ఢిల్లీలో 26.72 శాతం... నైరుతి ఢిల్లీలో 23.25 శాతం. సెంట్రల్ ఢిల్లీ లో 25.36 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఉదయం నుంచే మందకొడిగా సాగుతోంది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. 

 


 దీన్ని బట్టి చూస్తే ఢిల్లీ ప్రజలందరికీ ఓట్లు వేయడం ఇష్టం లేదా లేక పార్టీ అభ్యర్థులు ఎవరు నచ్చలేద అనే అయోమయం అందరిలో  నెలకొంటుంది. ఏదో ఓటు వేయడం ఇష్టం లేనట్లు ఓటర్లు  ఎవరు కూడా ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఢిల్లీలోని పోలింగ్ కేంద్రాలను వెలావెలాపోతున్నాయి. కాగా  2015 అసెంబ్లీ ఎన్నికల్లో  67.12 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి మరింత తక్కువగా  పోలింగ్ శాతం నమోదయ్యేలా   కనిపిస్తోంది. ఇంత దారుణమైన పోలింగ్ కేవలం ఢిల్లీలోనే సాధ్యమేమో అనిపిస్తోంది. ఐదు సంవత్సరాల పాటు తమ పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలు  ముందుకు రాకపోవడం పట్ల ఆసక్తిని కలిగిస్తోంది. దీన్ని బట్టి  చూస్తే ఏ పార్టీ కూడా తమకు సరైన పాలన అందిస్తామని ప్రజల్లో నమ్మకం కలిగించ లేదు అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: