ఢిల్లీలో పోలింగ్ సరళి చాలా విచిత్రంగా ఉంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది.  ఉదయం 3.30 గంటల ప్రాంతానికి నమోదైన ఓటింగ్ సగటు చూస్తే 45 శాతం నమోదైంది. అంటే ఓటింగ్ ఎంత మందకొడిగా సాగుతోందో అర్ధమైపోతోంది. ఇంత మందకొడి ఓటింగ్ గతంలో ఎప్పుడూ నమోదు కాకపోవటంతో అందరిలోను టెన్షన్ మొదలైపోయింది. విచిత్రమేమిటంటే ఇంత మందకొడి ఓటింగ్ లో కూడా తమకు 45 సీట్లు వస్తాయని బిజెపి నేతలు చెప్పుకోవటమే.

 

నిజానికి  పోలింగ్ ముందు జరిగిన ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో అత్యధికం మళ్ళీ ఆప్ కే ఓటర్లు పట్టం కట్టబోతున్నారంటూ కథనాలు వచ్చాయి.  బిజెపి తరపున ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా యే సర్వం చూసుకున్నారు. చివరకు ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో కూడా ప్రకటించ లేకపోయారంటే ఎంత ఇబ్బందులు పడ్డారో అర్ధమైపోతోంది. అదే సమయంలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోయారు.

 

అసలు కేజ్రీవాల్ ను  నామినేషన్ దశలోనే ఇబ్బంది పెట్టాలని బిజెపి పెద్ద ప్లానే వేశారు. కానీ చాలా తెలివిగా కేజ్రీవాల్ దాన్ని ఎదుర్కొన్నారు. అప్పటి నుండి బిజెపి వ్యూహాలను ముందుగానే గమనిస్తు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటు ప్రచారాన్ని ముగించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జాతీయ, అంతర్జాతీయ అంశాలేవీ ఢిల్లీ ఓటర్లుకు పట్టటం లేదని ఎగ్జిట్ పోల్ సర్వే సందర్భంగా తేలిపోయింది.

 

మోడి, అమిత్ షా లేమో జమ్మూ-కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, పౌర రిజిస్ట్రేషన్ వివాదం లాంటి అంశాలపై ప్రచారంలో మాట్లాడారు. కేజ్రీవాల్ ఏమో జనాలందరికీ మంచినీటి సరఫరా, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించటం, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మురికివాడల అభివృద్ధి, రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటు తదితరాలను మాత్రమే ప్రస్తావించారు. జనాలు కూడా కేజ్రీవాల్ ప్రస్తావించిన అంశాల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అంతా బాగానే ఉంది కానీ మరి ఈ పోలింగ్ శాతం తక్కువగా ఉండటమే అంతుబట్టకుండా ఉంది. ఓ పోలింగ్ పర్సంటేజ్ ఎవరి కొంప ముంచుతుందో ఏమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: