ఇది నిజంగా బంపర్ ఆఫర్ ఏ.. కానీ ఈ ఆఫర్ పెద్దగా తెలుగు ప్రజలకు ఉపయోగపడదు అనుకోండి.. అయినా పర్వాలేదు.. ఈరోజు ఢిల్లీలో ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. మాములుగా అన్ని చోట్లా ఎన్నికలు జరుగుతాయి.. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఇలా జరిగి ఉండదు.. 

 

కేవలం ఒక్క ఢిల్లీలో మాత్రమే ఇలా జరిగింది.. అసలు ఏం జరిగింది అంటే.. ఢిల్లీలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు.. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఎలక్షన్ కమిషన్ ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నో సంచలన కార్యక్రమాలు నిర్వహించింది.. 

 

అయితే ఈ తరహాలోనే మరో సంచలన కార్యక్రమం కూడా చేపట్టింది. అది ఏంటి అంటే ఓటు వేయడానికి రావడానికి ఉచిత ప్రయాణం.. ఒక్క రూపాయి లేకుండా ఓటు వేసి రావచ్చు.. ఇందు కోసం ప్రైవేట్ రంగ సంస్దలు కూడా సహకరించాయి. దీంతో బైక్, ఆటో, బస్సు, కారు, విమానం ఇలా అన్ని సంస్దలు ఓటు వెయ్యడానికి ప్రజలకు సహకరించింది. 

 

రాపిడో యాప్ నగరాల్లో ఉండే వారందరికీ ఈ యాప్ పరిచయం ఉంటుంది. అయితే ఈ యాప్ తో మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరుకు ఫ్రీ రైడింగ్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే మంచి ఆఫర్లు కూడా ఇచ్చింది. తమ బైక్ సర్వీసుల ద్వారా ఫ్రీ రైడింగ్ కల్పిస్తున్నారు. 

 

ఇంకా అభీ బస్ డాట్ కామ్.. ఇది తెలియని వారు ఉండరు.. ఈ సంస్ద కూడా అధిరిపోయే ఆఫర్ ని ఇచ్చారు. ఐ ఓట్.. ఐ విన్ నినాదంతో ఓటర్లకు ఫ్రీ బస్సు సర్వీసు అందిస్తుంది. ఇక విమానయాన సంస్ద కూడా ఈరోజు ఓటర్ల కోసం ఫ్రీ సర్వీసు అందిస్తున్నట్టు ప్రకటించింది. స్పైస్ జెట్ లో ఢిల్లీకి ప్రయాణించే వారి కోసం ఈ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఈరోజు ఢిల్లీకి వచ్చి మళ్లీ ఈరోజే వెనక్కు వెళ్లిపోయే వారికీ టిక్కెట్లపై ఉండే బేస్ టిక్కెట్ ఛార్జీని తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఏది ఏమైనా ఓటు హక్కు ఎంత విలువైనదో చెప్పడానికి మంచి బంపర్ ఆఫర్ ను ఇచ్చాయి ప్రైవేట్ సంస్దలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: