జగన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు అంతా తమ అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా జగన్ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చి ప్రజల్లోకి వెళ్లడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టిడిపి నాయకులు తమ గోడు అధినేత చంద్రబాబుకు చెప్పుకుంటూ ఊరట పొందుతున్నారు. అయితే జగన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గంపై జగన్ కన్నేశారు. 

 


1989 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలోనూ  కుప్పం నియోజక వర్గాన్ని చంద్రబాబు పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. కనీసం గ్రామ పంచాయతీగా ఉన్న మున్సిపాలిటీగా కూడా చేయలేకపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీగా కుప్పం ను  మార్చేందుకు ప్రయత్నించినా అది కార్య రూపం దాల్చలేదు.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పం ను మున్సిపాలిటీగా చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని వెనుక పెద్ద స్కెచ్ జగన్ వేసినట్లుగా అర్థమవుతోంది. 

 


మున్సిపల్ ఎన్నికలలో కుప్పం మున్సిపాలిటీని వైసిపి ఖాతాలో వేసి బాబుకు షాక్ ఇవ్వాలని జగన్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ  నియోజకవర్గం పరిధిలో కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాలు ఉన్నాయి. ఇక నియోజకవర్గ కేంద్రమైన కుప్పం మున్సిపాల్టీ పరిధిలో చీలి పల్లె, దళవాయి కొత్తపల్లె , చీమ నాయని పల్లె, సోమ గుట్ట పల్లె, తంబి గాని పల్లె, అనిమిగాని పల్లె, కమతమూరు పంచాయతీలు చేరాయి. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ ఖాతాల వేసుకుంటే చంద్రబాబును రాజకీయంగా దెబ్బ తీయవచ్చని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: