ఫేస్ బుక్ లో ఓ మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడతను. ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ స్నేహంగా మారింది. కూల్ డ్రింక్ లో మత్తు టాబ్లెట్లు కలిపి తాగించాడు. స్పృహ కోల్పోయిన మహిళపై అత్యాచారానికి పాల్పడి.. వీడియో తీసి డబ్బు డిమాండ్ చేసేవాడు. అలా 50 లక్షలు వసూలు చేశాడు ఆ మోసగాడు. వేధింపులు తీవ్రతరం కావడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. 

 

ఆ మోసగాడి పేరు మామిడి సంజీవరెడ్డి. హైదరాబాద్ బాచుపల్లిలో సంజీవరెడ్డి, అతని భార్య కావేరి, మేనల్లుడు   విశాల్ రెడ్డి నివాసముంటున్నారు. కొన్నాళ్లు అమెరికాలో ఉండి హైదరాబాద్ కోకాపేట్ కు వచ్చిన ఓ మహిళకు 2018లో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దానిని ఆమె అంగీకరించింది. ఆ తర్వాత ఇద్దరూ ఫేస్ బుక్, ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. 2018 అక్టోబర్ 31న బాధితురాలు అమెరికా నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుని ఆమె చెల్లెలి ఇంటి వద్ద డ్రాప్ చేశాడు. రెండ్రోజుల తర్వాత భోజనానికి రావాలని కూకట్ పల్లి లోని హోటల్ కు ఆహ్వానించాడు. హోటల్ కు వచ్చిన ఆమెకు అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్ రెడ్డి పరిచయం చేశాడు. 

 

బాధితురాలు భోజనం చేసేందుకు నిరాకరించడంతో.. కూల్ డ్రింక్ లో మత్తు ట్యాబ్లెట్లు వేసి తాగించాడు. బాధిత మహిళ స్పృహ కోల్పోయింది. బాధితురాలిని సంజీవరెడ్డి, అతని భార్య, మేనల్లుడు కలిసి నిజాంపేట్ కు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై అత్యాచారం చేసి.. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆమెను బెదిరిస్తూ ప్రతినెలా డబ్బు వసూలు చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె వద్ద ఉన్న 30 తులాల బంగారం, చెక్కులు, 6వేల డాలర్లు లాక్కున్నాడు. ఇలా ఆమె వద్ద నుంచి 50 లక్షల వరకు దోచుకున్నాడితను. 

 

ఇంకా డబ్బు ఇవ్వాలని వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు సంజీవరెడ్డి, అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్ ను బీదర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేధింపులు తట్టుకోలేక పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మహిళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

మరింత సమాచారం తెలుసుకోండి: