జోలె పట్టుకుని చంద్రబాబు వీధుల వెంట తిరుగుతూ ఉంటే ఇదేందయ్యా ఇది ...ఇది నేను సూడలే ! అనుకుంటూ కెవ్వు కేక వేసాను. ఏం ఖర్మ వచ్చిందిరా బాబు సేంద్రాల సారుకి ..? దర్జాగా ఎచీ కారులో తిరుగుతూ రెండు వేళ్ళు ఊపుకుంటూ ఎంత దర్జాగా ఉండేవాడండి ? అధికారం పోయిందని ఇలా వీధుల్లో పడి..... అసలు ఇలా అయిపోతాడని ఎవరూ ఊహించలేదు అంటే నమ్మండి. అయినా ఒక విషయం అర్ధం కావట్లేదు. అసలు సేంద్రాల సారుకి ఇలా రోడ్డు మీద పడాల్సిన ఖర్మ ఏంటో అర్ధం కావట్లేదు. రాజధాని కోసమో, ప్రచారం కోసమో కాదు కానీ జోలె పట్టుకుని వీధుల వెంట వెళ్తుంటే ఒక్కొక్కరూ పది పరక వేస్తూ సంచి నింపే ప్రయత్నాలు చేసిన సంఘటనలు మొన్నటి వరకు చూసాము. 


ఇక్కడే ఓ డవుట్ బాగా బుర్రలో తిరిగేస్తోంది. అసలు జోలె పట్టుకుని పది ఇరవై జనాల నుంచి పోజేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది ..? సేంద్రాల సారు పక్కనే ఉన్న జనాలను చూస్తే ఒక్కటి అర్ధం అవుతుంది వాళ్లంతా కోట్లకు పడగలెత్తిన కుబేరులు కదా ! ? ( మా సెంద్రలా సారు వాళ్ళకి బాగా లబ్ది చేకూర్చి వీళ్ళు నాలుగు రాళ్లు వెనకేసుకునేలా చేసాడు కదా) అదంతా మనకి అనవసరమే కానీ వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో కోటి ఇస్తే ఎన్ని కోట్లు పోగయ్యేయో మర్చిపోయినట్టున్నాడుగా ..? అసలు ఆడూ ఈడూ ఎందుకు ..? మాటలు కూడా సరిగా రాని సేంద్రాల సారు మనవడు కూడా కోటీశ్వరుడే కదా ? వాళ్ల తాతలు కూడా కుబేరులే కదా మరి వాళ్లు ఎంత ఇచ్చారో ..? ఇదంతా మనకి అనవసరమో , అవసరమో.


 అసలు ఇప్పుడు బాదంతా సంచి పట్టుకుని డబ్బులు పోజేసుకోవడంపైనే. నిన్నా ఈ రోజు ఐటీ శాఖ వాళ్లు సరదాగా తనికీలు చేస్తే సాధ సీదా వ్యక్తిగా ఉన్న సెంద్రాల సారు పీఏ ఇంట్లోనే ఆఫ్ట్రాల్ 150 కోట్లు దొరికేసాయి కదా ..? అసలు ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందో పెజానీకానికి తన్నుకొస్తున్న డౌటు. ఇంకా మంత్రులుగా చేసినోళ్లు, మాలోకం గారి ప్రియాతి ప్రియమైన దోస్తులు ఇందులో అడ్డంగా బుక్కయిపోతున్నారు. అందరి కొంపల్లోనూ వందల కోట్ల అవినీతి కట్టలు కట్టలుగా పడుతున్నాయి. అయినా ఇవన్నీ మనకి అనవసరం. ఎంత తవ్వినా ... అవినీతి కట్టలు కుట్టలుగా బయటకి వచ్చేస్తుంటే  సెంద్రాల సారుకి కూడా దడ దడలు మొదలయిపోయినట్టు ఉన్నాయిగా.


 అయినా ఆయనేమన్నా ఆషామాషీ వ్యక్తా ..? ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ వ్యక్తి.  అందుకే గా ముందుగానే తన భవిష్యత్తు ఊహించేసుకుని ఇలా జోలె పట్టుకుని ప్రాక్టీస్ అయిపోతున్నాడు అనేగా మీ డౌట్ ..? ఏమో బాబు నాకయితే ఏమీ తెలియదు ! మీ డౌట్స్ మీ ఇష్టం ఇందులోకి మమ్మల్నయితే లాగొద్దు.  

మరింత సమాచారం తెలుసుకోండి: