చైనాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌పై  ఇప్పటికే ఎన్నో రకాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రపంచాన్ని కబలించే రోజులు దగ్గర పడ్డాయని రక రకాల రూమర్లు పుట్టుకు వస్తున్నాయి.  కరోనా వైరస్ వ కారణంగా 564 మంది చనిపోయారని చైనా అధికారికంగా ప్రకటించింది.  చెనాలో అతి పెద్ద ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్ 'టెన్సెంట్' భయంకర నిజాన్ని వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్ 1,54,023 మందికి సోకిందని... వీరిలో 24,589 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో, చైనాలో తీవ్ర కలకలం రేగింది. సీఫుడ్ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఆమధ్య అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వారిని పరీక్షించిన డాక్టర్ లీ వారిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. అయితే అప్పట్లో ఆయన ఈ వైరస్ ప్రభావం.. తీవ్ర గురించి హెచ్చరించారు. సార్స్’ లాంటి ప్రమాదకర వైరస్ వుహాన్‌లో విస్తరిస్తోందని హెచ్చరించారు.

 

ఈ పోస్టును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అతడిని ఇబ్బంది పెట్టింది. వైరస్ గురించి అపోహలు ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు.  కానీ ఆ వైరస్ తోనే గురువారం అర్ధరాత్రి దాటాక 2:58 గంటలకు కన్నుమూశారు. ఆయనను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు.  తాజాగా కరోనా వైరస్ ఎఫెక్ట్ మనుషుల మీదనే కాదు.. వస్తువులపై, ఇతర తినుబండారాలపై, ఆయిల్ పై కూడా ప్రభావం చూపిస్తుంది.  గతంలో అమెరికా, ఇరాన్, ఇరాక్ దేశాల్లో ఏమైనా జరిగితే వాటి ప్రభావం మిగతా ప్రపంచం మీద ఉండేది. ఇప్పుడు అతిపెద్ద దేశం చైనా ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. కరోనా దెబ్బకు వ్యాపారాలు కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మనదేశంలో దిగి వస్తున్నాయి. వరుసగా మూడవరోజుకూడా పెట్రోలు డీజీలు తగ్గాయి రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది.

 

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు ధర తగ్గింది. దీంతో మొత్తంగా ఫిబ్రవరిలో పెట్రోల్ లీటరుకు 82 పైసలు, డీజిల్ లీటరుకు 85 పైసలు తగ్గాయి. కేంద్రం రోజువారీ ధరల సమీక్ష చేసుకోవచ్చని పెట్రోలియం సంస్థలకు సూచించడంతో కంపెనీలు ప్రతిరోజు ఉదయం ధరలను సవరిస్తున్నాయి.సవరించిన ధరలు మరుసటిరోజు ఉదయం వరకూ అమలులో వుంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పడిపోతోంది. ముడి బ్యారెల్‌ ధర 54.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తానికి కరోనా అన్నింటిని కడిగేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: