ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీ శాసనసభ పోలింగ్ ముగిసింది. పోలింగ్ కు సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న ఓటర్లను అనుమతిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి తక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. గతంలో ఢిల్లీ శాసనసభకు 2015 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. 2015 సంవత్సరంలో 67.12 శాతం పోలింగ్ శాతం పోలింగ్ నమోదైంది. 
 
కానీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం గతంతో పోలిస్తే దాదాపు 12 శాతం తక్కువ పోలింగ్ నమోదైంది. ఈరోజు పోలింగ్ ముగిసే సమయానికి కేవలం 54.67 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ క్యూ లైన్లలో ఉన్నవారు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఎన్నికల కమిషన్ తుది గణాంకాలను ప్రకటించనుంది. ఢిల్లీలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఢిల్లీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే ఢిల్లీలో ఏర్పడుతుందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తమ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆ సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పులకిత్ సివిల్ లైన్స్ ఏరియాలోని ఒక పోలింగ్ బూత్ లో కేజ్రీవాల్, కేజ్రీవాల్ సతీమణి, కేజ్రీవాల్ కుమారుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 13,750 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. 672 మంది అభ్యర్థులు 70 స్థానాలలో పోటీ చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. లక్ష్మీనగర్ నియోజకవర్గంలో ఓటు వేసి మరీ ఒక యువకుడు పెళ్లికి వెళ్లాడు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో వస్తుందని చెబుతూ ఉండటం గమనార్హం.        

మరింత సమాచారం తెలుసుకోండి: