ఢిల్లీలో గత సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ హవా చూపించటంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో బీజేపీ సత్తా చాటా అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. కానీ ఎనిమిది నెలల్లోనే ఢిల్లీలో బీజేపీ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఢిల్లీలో ప్రధానంగా పోటీ ఆప్, బీజేపీ మధ్యే నడిచినా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఆప్ హవా ముందు బీజేపీ పార్టీ పెద్దగా సత్తా చాటలేకపోయిందనే చెప్పాలి. 
 
ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా ఏ పార్టీకైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 స్థానాలు కావాలి. మూడింట రెండొంతుల ఆధిక్యత ఆమ్ ఆద్మీ పార్టీకి కనిపిస్తుండగా బీజేపీ 15 స్థానాలకు అటూ ఇటుగా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఏబీపీ సీఓటర్ సర్వేలో ఆప్ పార్టీ 49 - 63, బీజేపీ 5 - 19, కాంగ్రెస్ పార్టీ 0 - 4 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తోంది. 
 
న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్  ఆప్ 53 - 57, బీజేపీ 11 - 17, కాంగ్రెస్ 0 -2 స్థానాలలో విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది. రిపబ్లిక్ - జన్ కీ బాత్ ఆప్ 48 - 61, బీజేపీ 09 - 21, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియా న్యూస్ నేషన్ ఆప్ 55 బీజేపీ 14 కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. 
 
టైమ్స్‌ నౌ - ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఆప్ 44 బీజేపీ 26 కాంగ్రెస్ ఒక స్థానం కూడా విజయం సాధించదని తేల్చింది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిననుండగా బీజేపీ పార్టీకి కూడా ఢిల్లీ ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఆప్ బీజేపీ నమ్మకమైన ఓటర్లను కూడా తనవైపు తిప్పుకోగలిగింది. ఢిల్లీలో అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకుని ఆప్ మరోసారి విజయడంఖా మ్రోగించనుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: