తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి దాదాపు 8 నెలలు దాటేసింది. ఈ 8 నెలల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగు తమ్ముళ్ళు జగన్ ప్రభుత్వంపై పోరాటాల పేరుతో తెగ హడావిడి చేసేస్తున్నారు. ప్రజలు పెద్దగా పట్టించుకోపోయిన బాబు అండ్ బ్యాచ్ మీడియా ముందు కనపడటం, రోడ్ల మీద తిరగడం చేస్తున్నారు.  అయితే బాబు చేసే పోరాటాలకు ప్రజల మద్ధతే కాకుండా సొంత నేతల మద్ధతు అసలు దక్కడం లేదు. ఏదో కొందరు నేతలు మాత్రమే బాబు పోరాటాలకు సపోర్ట్ ఇస్తున్నారు గానీ, మిగతా నేతలు అసలు కనపడటం లేదు.

 

ముఖ్యంగా వైసీపీ కంచుకోట జిల్లా అయిన నెల్లూరు(సింహపురి)జిల్లాలో పసుపు నేతలు కంటికి కనపడటం లేదు. దారుణంగా ఓడిపోవడం, భవిష్యత్‌లో పార్టీ అధికారంలోకి వచ్చిన నెల్లూరులో మాత్రం గెలవడం కష్టమని భావించవచ్చు గానీ జిల్లా నేతలు పెద్దగా పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదు. అసలు జిల్లాలో టీడీపీని లీడ్ చేసే మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. అనారోగ్య కారణాల వలనేమో గానీ ఈయన పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రం బయటకొచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్లిపోతున్నారు.

 

అటు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రాయాదవ్ బాగానే యాక్టివ్‌గా ఉన్నారు. అధ్యక్షుడు కావడం, పైగా ఎమ్మెల్సీ పదవి ఉండటంతో బీదా పార్టీ కోసం కష్టపడుతున్నారు. అయితే ఈయన సోదరుడు బీదా మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్ళడంతో రవిచంద్రాకు కాస్త ఇబ్బందులు వచ్చే పరిస్తితి వచ్చింది. ఇక అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలని శాసించిన మాజీ మంత్రి నారాయణ...ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. ఏదో బాబు పిలిచినప్పుడు మాత్రం అమరావతిలో ప్రత్యక్షమవుతున్నారు. పైగా ఈయనపై ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు కూడా ఉండటంతో మెదలకుండా ఉన్నారు.

 

ఇక నెల్లూరు రూరల్ నుంచి ఓడిపోయిన అబ్దుల్ అజీజ్ మాత్రం కొంచెం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు.  మాజీ ఎమ్మెల్యేలు బొలినేని రామారావు, శ్రీనివాసులురెడ్డి, పాశం సునిల్, బొలినేని కృష్ణయ్య, కె. రామకృష్ణలు అయితే పార్టీ వైపు తొంగి చూడటం లేదు. మొత్తం మీద చూసుకుంటే సింహపురిలో పసుపు జెండా మాయమైపోయేలా కనిపిస్తుంది. పైగా జిల్లా వైసీపీకే కంచుకోటగా ఉండటంతో, భవిష్యత్‌లో కూడా టీడీపీ జెండా ఎగరడం కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: