ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవాడలో ప్రారంభించడానికి వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ సమయంలో మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీరియస్ అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు కర్నూల్ ని రాజధానిగా చేయాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట మారుస్తూ కర్నూలు కు హైకోర్టు వచ్చే ఉద్యోగాలు ఏమైనా వస్తాయా..? అని ప్రశ్నించటం చాలా సిగ్గుచేటు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

మాటలు మారుస్తూ ప్రజలను రెచ్చగొట్టడంలో కన్ఫ్యూజ్ చేయడంలో పవన్ కళ్యాణ్ కి మించిన వారు లేరని విమర్శించారు. రాజకీయాల్లో పెద్ద అజ్ఞాని పవన్ కళ్యాణ్ అంటూ సెటైర్లు వేశారు. అప్పట్లో ఎన్నికల సమయంలో కర్నూలులో మీటింగ్ పెట్టి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక రాజధానిని కర్నూల్ చేస్తానని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం చరిత్రాత్మకమైన నిర్ణయమని రాష్ట్రంలో ప్రతిపక్షాలు అందరు కూడా కావాలనే మూడు రాజధానులను ప్రజలకు వ్యతిరేకంగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది బాధాకరమైన అంశం అని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

 

అన్ని ప్రాంతాల నుండి మద్దతు వస్తుంటే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తున్నాయని సీరియస్ అయ్యారు. మూడు రాజధానుల పై ప్రజలలో భయాందోళనలు కలిగించే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరగాలని జగన్ ఆలోచిస్తుంటే ప్రతిపక్షాలు ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేయటం నిజంగా బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: