అత్యాచారం.. మహిళలపట్ల మగాడు చేసే క్రూరమైన నేరం.. ఆడది అబల అని.. ఎదిరించలేదన్న పురుషాహంకారంతో.. మృగాళ్లు రెచ్చిపోతున్నారు. దీనికి తోడు మన సమాజంలో సహజంగానే స్త్రీ పట్ల చిన్నచూపు మొదటి నుంచి ఉంది. ఇవన్నీ కలసి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నాయి.



ఏపీ రేపుల రాజధానిగా మారుతోందని చెప్పాల్సిన దుస్థితి ఉంది. మన రాష్ట్రంలోని అత్యాచార గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. ఈ విషయం బోధపడుతుంది. మన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు 2014లో దాదాపుగా 13,549 కేసులు నమోదు అయ్యాయి. 2015లో వీటి సంఖ్య 13,088 కేసులు. 2016లో 13,948 కేసులు. 2017లో 14,696 కేసులు, 2018లో 14,048 కేసులు నమోదయ్యాయి.



ఇక వాటిల్లో రేప్‌ కేసులు 2014లో 937 కేసులు, 2015లో 1014 కేసులు, 2016లో 969 కేసులు, 2017లో 1046 కేసులు, 2018లో 1096 కేసులు నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక బాలికలపై జరిగిన అత్యాచారాలు 2014లో 4032 కేసులు, 2015లో 4114, 2016లో 4477 కేసులు, 2017లో 4672 కేసులు, 2018లో 4215 కేసులు నమోదయ్యాయి. అంటే.. మన కళ్ల ఎదుటనే, మన రాష్ట్రంలోనే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇన్ని ఘోరాలు జరిగాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: